అప్పుడు అల్లు రామలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిశారట. సురేఖ పెళ్లి విషయంలో ఆయన సలహా కోరారట. ఏమండి రెడ్డిగారూ... ఇలా రెండు సంబంధాలు వచ్చాయి . చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అంటున్నాడు. మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది. ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది, అని అడిగారట.
అల్లు రామలింగయ్య ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పారట. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్పింటికి పంపినా సంతోషంగా ఉండదు. అందుకే సురేఖనే అడుగు, అమ్మాయి ఇష్టప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చాడట.