Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్

Published : Jun 08, 2026, 04:38 PM IST

ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం మెగాస్టార్ చిరంజీవి దాదాపు 300 మంది చిత్ర యూనిట్ ని వెనక్కి రప్పించారు. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసమే షూటింగ్ పూర్తి చేశారు. చిరంజీవి ఎందుకు అలా చేశారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
మనసులు దోచుకున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ప్రేక్షకుల మనసులు దోచుకున్న మెగాస్టార్. రియల్ లైఫ్ లో కూడా చిరంజీవి తన వ్యక్తిత్వంలో అందరి హృదయాలు గెలుచుకున్నారు. చిరంజీవి గొప్ప మనసు గురించి ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

25
ఠాగూర్ లో హాస్పిటల్ ఎపిసోడ్

రాజా రవీంద్ర మాట్లాడుతూ నేను ఠాగూర్ మూవీలో కీలక పాత్రలో నటించాను. ఆ మూవీలో హాస్పిటల్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. చనిపోయిన వ్యక్తికీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు నటిస్తూ డాక్టర్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటారు. ఆ హాస్పిటల్ ఓనర్ గా నేను నటించాను. ఆ సీన్ తర్వాత చిరంజీవి గారు నాకు వార్నింగ్ ఇచ్చే సన్నివేశం ఉంటుంది. ఆ రోజు ఈవెనింగ్ ఆ సీన్ షూటింగ్ కంప్లీట్ చేసి మరుసటి రోజు ఉదయం ఫ్లైట్ కి నేను చెన్నై వెళ్ళాలి.

35
షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు

చెన్నైలో ఈటీవీ వాళ్ళది ఈనాటి రామాయణం షూటింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ షూటింగ్ కి నేను వెళ్లి హాజరు కావాలి. లేకుంటే టెలికాస్ట్ ఆగిపోయే పరిస్థితి. ఆ రోజు ఈవెనింగ్ ఠాగూర్ షూటింగ్ కి రెడీ అవుతున్నా. మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. చిరంజీవి గారు ఈ రోజు షూటింగ్ మధ్యలోనే ఆపేశారు. షూటింగ్ ఇప్పుడు లేదు. ఆయన ఒక రీమేక్ సినిమా చూస్తున్నారు అని చెప్పారు. షూటింగ్ లేకపోవడం ఏంటయ్యా బాబూ.. నేను మార్నింగ్ చెన్నైకి వెళ్ళాలి అని చెప్పా. అయితే వేరే ఆర్టిస్ట్ ని పెట్టుకుంటాం లేండి అని మేనేజర్ అన్నారు.

45
చిరంజీవి గారికి చెప్పా

అప్పుడే చిరంజీవి గారు నన్ను పిలిచారు. ఒక మూవీ చూడడానికి వెళుతున్నా వస్తావా అని నన్ను అడిగారు. నేను సైలెంట్ గా ఉన్నాను. ఏంట్రా డల్ గా ఉన్నావు అని అడిగారు. ఏం లేదు అన్నయ్యా.. ఈ రోజు షూటింగ్ లేదు అని చెప్పారట కదా. నాకు రేపు వేరే షూటింగ్ ఉంది. కాబట్టి ఠాగూర్ లో నా వేషం పోయినట్లే అని చెప్పా. నాకు ముందే చెప్పాలి కదా అని అన్నారు. వెంటనే ఠాగూర్ నిర్మాత మధుకి చిరంజీవి గారు ఫోన్ చేశారు. సినిమా యూనిట్, షూటింగ్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ వెనక్కి రావాలి, ఎంత టైం పడుతుంది అని అడిగారు. అప్పటికే అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. టైం 6.30 అవుతోంది. కాబట్టి అందరూ రావడానికి రాత్రి 9 అవుతుంది అని చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు షూటింగ్ ఫినిష్ చేద్దాం. నేను మూవీ రేపు చూస్తానులే అని అన్నారు.

55
నా కోసం 300 మందిని వెనక్కి రప్పించారు

9 అయ్యేసరికి దాదాపు 300 మంది వెనక్కి వచ్చారు. నా ఒక్కడి కోసం చిరంజీవి గారు వాళ్లందరినీ వెనక్కి రప్పించారు. ఒక ఆర్టిస్ట్ ఇబ్బంది పడుతుంటే చిరంజీవి గారు ఏమైనా చేస్తారు అనేదానికి ఇదే ఉదాహరణ అని రాజా రవీంద్ర తెలిపారు. ఆ ఉదయం చిరంజీవి గారే నేను చెన్నై వెళ్లేందుకు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేశారు అని రాజా రవీంద్ర తెలిపారు. ఇంద్ర షూటింగ్ లో కూడా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. డైరెక్ట్ బి గోపాల్ గారికి అదే సమయంలో మరో మూవీ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. దీనితో ఇంద్ర ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు. అది కూడా మండుటెండలు ఉండే మే నెలలో. విపరీతమైన ఎండలో చిరంజీవి గారు నటిస్తూ దర్శకత్వం చేశారు. నెలరోజులు ఎండలోనే షూటింగ్ జరిగింది. వందల మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయ్యాక అందరికీ చిరంజీవి గారు దండం పెట్టి క్షమాపణ కోరారు. రిలీజ్ టైం దగ్గర పడుతోంది.. అందుకే మీరంతా ఇబ్బంది పడుతున్నా ఎండల్లో సైతం షూటింగ్ చేయాల్సి వచ్చింది, క్షమించండి అని చిరంజీవి కోరినట్లు రాజా రవీంద్ర తెలిపారు. చిరంజీవి గారి వ్యక్తిత్వానికి ఇది మరో ఉదాహరణ అని రాజా రవీంద్ర అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories