నేను దుగ్గిరాల వాళ్ళ కోడల్ని అందుకే అలా చేశాను మీ ఆవేశం సంగతి నాకు తెలుసు. మీరు అంత ఆవేశంతో వెళ్లారు ఈ ఇంటి వారసుడు రోడ్డెక్కి ఒక ఆడపిల్లని అవమానిస్తూ ఉంటే చూసేవాళ్ళు చూస్తూ ఊరుకుంటారా, పోయేది ఎవరి పరువు అంటూ నిలదీస్తుంది కావ్య. ఆవేశం వలన వివేకం విజ్ఞత అన్ని నశిస్తాయి అప్పుడు ఎవరి వంశ గౌరవం నశిస్తుంది, అందుకే ఆ గొడవ ఆపడం కోసం నేను అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చాక అక్క లేదని తెలిసింది అప్పుడు మీ కంటపడితే అంతమంది ముందు ఇలాగే అవమానిస్తారని మీ కంట పడకూడదు అనుకున్నాను కర్మకొద్దీ మీకు దొరికిపోయాను.