ఏం..నాకు చెప్పొచ్చు కదా, మనమే కష్టం తెలుసుకొని సాయం చేయాలా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఈగో ఇద్దరి చుట్టూ వైఫై లాగా తిరుగుతుంది అని బాధపడతాడు కళ్యాణ్. ఆ తర్వాత రాజ్ నిద్రపోతాడు కానీ కావ్య డిజైన్స్ గీయటానికి కూర్చుంటుంది. కానీ తల్లిదండ్రులకి ఎలా హెల్ప్ చేయాలి అని ఆలోచనతో డిజైన్స్ సరిగ్గా వేయలేకపోతుంది. అదే సమయం లో మెలకువ వచ్చిన రాజ్ కావ్య పరిస్థితిని గమనించి డిజైన్స్ గురించి ఐడియా రాకపోతే పడుకో అలా డిస్టర్బ్ అవ్వకు అంటాడు.