యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి చిత్రాల్లో రాహుల్ రామకృష్ణ తనదైన మార్క్ ప్రదర్శించాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.