ఛీ నన్నెందుకు ఇరికిస్తారు.. పునర్నవి ప్రెగ్నెన్సీ రూమర్స్, అందుకే అషురెడ్డి అంటే గౌరవం..రాహుల్ సిప్లిగంజ్

Published : Apr 05, 2023, 04:05 PM IST

రాహుల్ సిప్లిగంజ్ గతంలో పునర్నవి భూపాలం, అషురెడ్డి లతో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. వాళ్ళతో రాహుల్ సన్నిహితంగా మెలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

PREV
16
ఛీ నన్నెందుకు ఇరికిస్తారు.. పునర్నవి ప్రెగ్నెన్సీ రూమర్స్, అందుకే అషురెడ్డి అంటే గౌరవం..రాహుల్ సిప్లిగంజ్

తాను పాడిన పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ మరో స్థాయికి చేరింది. గల్లీ యువకుడిగా కెరీర్ మొదలు పెట్టిన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పెర్ఫామ్ చేసే స్థాయికి ఎదిగాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచినప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కి ఒక రకమైన క్రేజ్ ఉంటే.. ఇప్పుడు గాయకుడిగా అతడిపై ప్రతి ఒక్కరిలో గౌరవం పెరిగింది. కొన్ని వివాదాల్లో నిలిచినప్పటికీ రాహుల్ ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 

 

26

ఆస్కార్ ని ముద్దాడి తిరిగొచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. తాను పాడిన నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కడం, అక్కడ వేదికపై లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంతోషాన్ని రాహుల్ పంచుకుంటున్నాడు. ఒక క్రేజ్ వచ్చాక చాలా మంది తమ అలవాట్లని కప్పి ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ నా మనస్తత్వం అది కాదు. 

 

36

ఎక్కడికైనా వెళతా, నచ్చినట్లు ఎంజాయ్ చేస్తా.. జీవితంలో ఎలాంటి హద్దులు పెట్టుకోను.. అదే సమయంలో కెరీర్ పైన కూడా ఫోకస్ చేస్తా అని రాహుల్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ గతంలో పునర్నవి భూపాలం, అషురెడ్డి లతో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. వాళ్ళతో రాహుల్ సన్నిహితంగా మెలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూలో రాహుల్ తన రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడాడు. 

 

46

పునర్నవి గురించి మాట్లాడుతూ.. ఒక స్నేహితుడిగానే ఇప్పటికి ఆమెతో టచ్ లో ఉన్నాను అని తెలిపాడు. ఇటీవల పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ కొన్ని పిక్స్, రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనితో తెరపైకి రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా వచ్చింది అని యాంకర్ ప్రశ్నించగా.. ఛీ ఛీ నన్నెందుకు ఇరిస్తారు. అయినా పునర్నవి గర్భవతి ఏంటి.. అలా ఏమి ఉండదు అని నవ్వేశాడు. 

 

56

బిగ్ బాస్ సమయంలో ఇద్దరం క్లోజ్ గా ఉన్నాం. బిగ్ బాస్ అయిపోయింది. ఎన్నో జరుగుతున్నాయి.. లైఫ్ మూవ్ ఆన్ అవుతోంది. ప్రస్తుతం నా ద్రుష్టి మొత్తం కెరీర్, బిజినెస్ పైనే. త్వరలో కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నా అని రాహుల్ తెలిపాడు. 

 

66

అలాగే అషురెడ్డితో రాహుల్ డేటింగ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీని గురించి రాహుల్ మాట్లాడుతూ.. అషురెడ్డి నాకు చాలా మంచి ఫ్రెండ్. అవసరమైన వాళ్ళకి సాయం చేసే వ్యక్తిత్వం ఆమెది. ఆమె వల్ల సాయం పొందిన వారిలో నేను కూడా ఒకడిని. సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టడం వల్లనో, మేమిద్దరం క్లోజ్ గా ఉండడం వల్లనో మమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తే అది వారి సమస్య. వేరే వాళ్ళు ఎదో మాట్లాడుతున్నారని మా స్నేహాన్ని పాడు చేసుకోలేం అని రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. 

click me!

Recommended Stories