ఎపిసోడ్ ప్రారంభంలో నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి నీ అంత స్వీట్ గా ఉండాలి అంటూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు మదన్. మరోవైపు అంజలి యాదగిరి కి ఫోన్ చేసి మదన్ వచ్చేసరికి అక్కడ అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా చూడమని ఆనంద్ కి చెప్పు అని చెప్తుంది. ఈవిడకి అతని మీద ఎందుకు అంత నమ్మకం అనుకుంటూ విషయాన్ని అందరికీ చెప్తాడు యాదగిరి.ఈరోజు నుంచి బిజినెస్ అంతా పెద్దసారే చూసుకుంటారు అంజలి మేడం అంటే అమాయకురాలు కాబట్టి కొందరి ఆటలు సాగాయి ఇకనుంచి అలా కుదరదు అతను వచ్చే సమయానికి అందరూ పని చేస్తున్నట్లుగా కనిపించండి అంటాడు యాదగిరి.
.