అలా హీటు పెంచేసి.. ఇలా తగ్గించేస్తోంది.. మృణాల్ ఠాకూర్ రూటే సపరేటు..

First Published | Apr 5, 2023, 3:21 PM IST

‘సీతారామం’ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది యంగ్ హీరోయిన్  మృణాల్ ఠాకూర్. మరోవైపు సోషల్ మీడియాలోనూ స్టన్నింగ్ ఫొటోషూట్లతో సందడి చేస్తోంది. ఒక్కో రోజు ఒక్కో తీరుగా దర్శనమిస్తూ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.
 

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.  ‘సీతారామం’ చిత్రంతో సీతామాలక్ష్మిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చక్కటి రూపసౌందర్యం, అద్బుతమైన  నటనతో అందరి హృదయాలను కొల్లగొట్టింది.  
 

తొలుత సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ వచ్చిన మృణాల్ తనలోని మరోకోణాన్ని చూపిస్తూ షాకిచ్చింది. ఒకేసారి బికినీలు, సెక్సీ అవుట్ ఫిట్లో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపింది. సౌత్ లో మంచి క్రేజ్ రావడంతో అందాల ఆరబోతలో పిచ్చెక్కించింది. నిన్న  కూడా తన బికీనీ ఫొటోలను షేర్ చేసుకుంది.
 


దాంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మృణాల్ ను బికినీల్లో చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు సూపర్ హాట్ అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం మా సీతామహాలక్ష్మి ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా  బోల్డ్ లుక్ హీట్ పెంచేసి నెట్టింట  రచ్చరంభోలా చేస్తోంది.  
 

దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. నిన్న బికినీల్లో దర్శనమిచ్చి హీటు పెంచేసిన మృణాల్ ఠాకూర్ మళ్లీ ఇవ్వాళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం తాజాగా చుడీదార్ లో ఫొటోషూట్ చేసింది. 
 

ఆ పిక్స్ ను ఇన్ స్టా వేదికన అభిమానులతో పంచుకున్నారు. పొడవైన ఫ్రాక్ లో మృణాల్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. హాల్లోని  సోఫాలు, ఫర్నీచర్ వద్ద బ్యూటీఫుల్ గా ఫోజులిచ్చి ఆకట్టుకుంది. మత్తు చూపులు, క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేస్తోంది. 
 

మరోవైపు బాలీవుడ్ లో ‘జెర్సీ’, తెలుగులో ‘సీతారామం’ తర్వాత మృణాల్ క్రేజ్ సౌత్, నార్త్ లో భారీగా పెరిగిపోయింది. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ తోనూ రచ్చ చేసింది. రీసెంట్ గా ‘సెల్ఫీ’లో ‘కుడియే నీ తేరి’ ఐటెం సాంగ్ లో నటించి ఉర్రూతలూగించింది. 
 

దీంతో మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. దానికితోడు సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్ తోనూ మంటలు రేపుతోంది. ఫలితంగా యంగ్ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు చిత్రాలు,  తెలుగు ఒక చిత్రంలో నటిస్తోంది.
 

మృణాల్ నటించిన ‘గుమ్రాహ్’ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదిత్య రాయ్ కపూర్, మృణాల్  జంటగా నటించిన  ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ‘పూజా మేరీ జాన్’, ‘పిప్పా’, ‘ఆంక్ మిచోలీ’ హిందీ చిత్రాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.  ఇటు తెలుగులోనూ Nani30లో నటిస్తోంది.

Latest Videos

click me!