ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న ఫోన్ చేస్తుంటే దీన్ని తెలిపితే ఫుడ్డు, హోటల్ అంటూ మేపాలి అనుకుంటూ ఫోన్ కట్ చేసేస్తాడు రాహుల్. అందుకు హర్ట్ అయిన స్వప్న లాభం లేదు రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలి ఇంక నేను ఈ అవమానాలు భరించలేను అనుకుంటుంది స్వప్న. మరోవైపు అల్లుడు కోసం చాలా రకాల వంటలు చేసి పెడతారు కనకం, మీనాక్షి.ఇన్ని రకాలు ఎందుకు చేశారమ్మ మీకు కష్టం కదా అంటుంది కావ్య. కష్టం కాదమ్మా ఇష్టం అసలు మన ఇంటి ఛాయలకే రారు అనుకున్న అల్లుడు ఇంటి లోపలికి వచ్చారు అలాంటి ఆయనకి మనం ఎంత మర్యాద చేయాలి అంటుంది కనకం.