కానీ నువ్వు నా కూతురు లాంటి దానివి కదా. ఎందుకు అంత ప్రేమ చూపించి ప్రతిసారి వాడిని వెనకేసుకొని వస్తున్నావు. అయినా నాకు నువ్వంటే ఇష్టమే అసలు కోపం రాదు అని వేదని హత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. ఆ తర్వాత సీన్లో అభిమన్యు, చిత్ర ఫోటోని లాప్టాప్ లో చూస్తూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మన బంగారు జీవితం ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏదో ఫోన్ వచ్చి బయటికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మాళవిక వచ్చి చిత్ర ఫోటో చూస్తుంది.