#Akhanda2: మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో.. ఈసారి పూనకాలు తెప్పించే టైటిల్‌

First Published | Oct 16, 2024, 9:06 AM IST


అఖండ సినిమా తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు. చెప్పినట్టే అఖండ 2 సినిమాని నేడు అనౌన్స్ చేసారు. 

Balakrishna, Boyapati, Akhanda 2-Thaandavam,

 నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. బాలయ్యకు మరో మాస్ హిట్ పడటానికి రంగం సిద్దమైంది. బోయపాటి-బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్ లో కొత్త చిత్రం ఎనౌన్సమెంట్ వచ్చింది. వీళ్లద్దరి కాంబోలో  సినిమా వస్తుందంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

akhanda

2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. దీంతో వీళ్లిద్దరి తర్వాత ప్రాజెక్ట్‌పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్‌ కానుంది. ‘అఖండ 2 - తాండవం’ పేరుతో సీక్వెల్‌ తెరకెక్కనుంది. టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాణసంస్థ తాజాగా విడుదల చేసింది. పోస్టర్‌లో ఆధ్యాత్మికతను జోడిస్తూ.. శివలింగం, రుద్రాక్షలు, హిమాలయాలు వంటి పలు అంశాలను చూపారు.


Image: Akhanda

తొలి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. 'స్కంద' డిజాస్టర్ తర్వాత బయట కనిపించని బోయపాటి.. గత కొన్నాళ్లుగా దీని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అది పూర్తి చేయడంతో అధికారికంగా ప్రకటించారు. బుధవారం పూజాతో మూవీ లాంచ్ చేయనున్నారు.  బాలకృష్ణను మాస్‌ అవతారంలో చూపించడంలో బోయపాటి ముందుంటారు. భారీస్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనుంది.  
 

akhanda

బాలకృష్ణ - బోయపాటి ఇద్దరి కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాగా రానుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించనున్నారు. దీని రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. 14 రీల్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్‌ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు.

బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. అటు దర్శకుడు బోయపాటితో పాటు.. బాలకృష్ణకు కూడా ఇదే మొదటి పాన్‌ ఇండియా చిత్రం కానుండడం విశేషం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. హిందీలో డబ్‌ చేయగా అక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. దీంతో దీని సీక్వెల్‌ను పాన్‌ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

నేడు ఉదయం అఖండ 2 సినిమా పూజా కార్యక్రమం కూడా జరగబోతుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ కి వెళ్లనుంది. అయితే ఈసారి అఖండ 2ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో బాలయ్యకు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కానుంది.

దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ మూవీతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దీన షూటింగ్ డిసెంబరుకి పూర్తవుతుంది. దీని తర్వాతే 'అఖండ 2' షూటింగ్‌లో బాలకృష్ణ పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతమందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా విషయాల్ని త్వరలో వెల్లడిస్తారు.

మెగాస్టార్ 'విశ్వంభ‌ర' కు వివి.వినాయ‌క్ సాయం, ఆ పార్ట్ మొత్తానికి ఆయనే డైరెక్టర్‌?

Latest Videos

click me!