ఆ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ చేయకుండా అడ్డుకున్న చిరంజీవి సతీమణి సురేఖ, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్

Published : May 03, 2025, 06:55 PM IST

రాంచరణ్ ఎంట్రీ వెనుక జరిగిన ప్రయత్నాలు, ఊహించని పరిణామాలని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

PREV
15
ఆ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ చేయకుండా అడ్డుకున్న చిరంజీవి సతీమణి సురేఖ, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్
Ram Charan, Surekha Konidela

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. రాంచరణ్ టాలీవుడ్ లోకి చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో, అశ్విని దత్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. రాంచరణ్ కి ఇది పర్ఫెక్ట్ లాంచ్ అనే చెప్పాలి. 

 

25
Ram Charan

అయితే రాంచరణ్ ఎంట్రీ వెనుక జరిగిన ప్రయత్నాలు, ఊహించని పరిణామాలని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పూరి జగన్నాధ్ కంటే ముందుగా రాంచరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సింది. కానీ రాజమౌళి తాను చరణ్ తో సెకండ్ మూవీ చేస్తానని చిరుకి మాట ఇచ్చారు. అంతకంటే ముందుగా రాంచరణ్ ని లాంచ్ చేసేందుకు ప్రయత్నించింది ఎవరంటే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఈ విషయాన్ని అశ్విని దత్ స్వయంగా చెప్పారు. 

 

35

రాఘవేంద్ర రావు వద్ద గంగోత్రి కథ రెడీగా ఉంది. చిరంజీవి కొడుకు రాంచరణ్ తో ఈ సినిమా చేద్దాం అని రాఘవేంద్ర రావు అన్నారు. చిరంజీవి ఈ కాంబినేషన్ కి ఆల్మోస్ట్ ఒకే చెప్పేశారట. కానీ చిరు సతీమణి సురేఖ అడ్డుకున్నారు. మరో ఏడాదిలో చరణ్ డిగ్రీ పూర్తవుతుంది. ఇప్పుడే చరణ్ ఎంట్రీ వద్దు. చరణ్ హీరోగా ఎంట్రీ ఇస్తే అది మీ దర్శకత్వంలోనే అని సురేఖ.. రాఘవేంద్ర రావుకి మాట ఇచ్చారు. ఆ విధంగా చరణ్, రాఘవేంద్ర రావు కాంబినేషన్ ఆగిపోయింది. 

 

45

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రాంచరణ్ తొలి చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. రాంచరణ్ తో చేయాలనుకున్న గంగోత్రి చిత్రాన్ని రాఘవేంద్ర రావు అల్లు అర్జున్ తో తీశారు. అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ రెడీగా ఉన్నాడు అని అశ్విని దత్ చెప్పారట. దీనితో రాఘవేంద్ర రావు.. తీసుకొచ్చెయ్.. చేసేద్దాం అని అన్నారట. 

 

55

అశ్విని దత్ ని ఇండస్ట్రీలో వారసుల లాంచింగ్ ప్యాడ్ అని ఫన్నీగా పిలిచేవారట. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలంతా అశ్విని దత్ నిర్మాణంలోనే ఎంట్రీ ఇచ్చారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories