హాలీవుడ్ ఫిల్మ్ `ముఫాసా`కి మహేష్ బాబు వాయిస్ ఓవర్..
హాలీవుడ్ ఫిల్మ్స్ కి మన స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. తాజాగా మహేష్ బాబు `ముఫాసాః ది లయన్ కింగ్` చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని నమ్రత తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు తన ఆనందం వ్యక్తం చేశారు. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 20న ఇండియాలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ఇందులో టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్, టిమోన్ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.
`ఘంటసాల` మూవీ రిలీజ్ డేట్..
సింగర్ కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేసిన మూవీ `ఘంటసాల`. గానగాంథర్వుడు ఘంటసాల జీవితం ఆధారంగా ఈ సినిమాని సీహెచ్ రామారావు రూపొందించారు. సీహెచ్ శ్రీమతి ఫణి నిర్మించారు. ఇందులో ఘంటసాల వెంకటేశ్వరరావు భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదులనే పోషించడం విశేషం. ఆదివారం హైదరాబాద్ రిలీజ్ డేట్ ఈవెంట్‌ని నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చి `ఘంటసాల` రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ మ్యూజిక్ ఎంటర్‌టైనర్‌ని విడుదల చేయబోతున్నట్టు టీమ్ తెలిపింది. వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఇందులో ఆర్ నారాయణ మూర్తి కూడా పాల్గొనడం విశేషం.
ఓటీటీలో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం `క`..
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ `క`. నయన్ సారి, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. ఈ మూవీ గత నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈటీవీ విన్ లో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అద్బుతమైన స్పందన లభిస్తుందని కిరణ్ అబ్బవరం అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా `క` కావడం విశేషం. దీని గురించి కిరణ్ చెబుతూ, అందుకు చాలా సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా సినిమా మరింత డీటెయిలింగ్ గా సౌండ్, విజువల్స్ మరింతగా ఆకట్టుకుంటాయి. థియేటర్ లో క సినిమా చూసిన వాళ్లు కూడా మరోసారి ఈటీవీ విన్ లో చూడండి అన్నారు.
తెలుగులోకి `పా పా`గా తమిళ బ్లాక్ బస్టర్ `డా డా`..
తెలుగు తెరపైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
గత ఏడాది తమిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌లకు కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
సంచలన కాన్సెప్ట్ తో `ఎం4ఎం`..
మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వరల్డ్‌వైడ్‌గా అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో తెరకెక్కించామని చెప్పారు.
110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్టు తెలిపారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆసక్తికరమైన కాంపిటీషన్ ప్రకటించారు. విడుదలైన ఫస్ట్ డే ఈ సినిమా చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.