భక్తికైనా, రక్తికైనా ఒకే ఒక్కడు నాగ్.. మా అన్నమయ్య అంటూ దర్శకేంద్రుడు, బాలు ఊహించినా జరగలేదు

First Published Aug 29, 2021, 6:18 PM IST

ఎవర్ గ్రీన్ మన్మథుడు, కింగ్ నాగార్జున నేడు 62వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. నాగార్జునకు అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎవర్ గ్రీన్ మన్మథుడు, కింగ్ నాగార్జున నేడు 62వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. నాగార్జునకు అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆరుపదుల వయసులో కూడా యంగ్ లుక్ లో కనిపించడం కేవలం నాగార్జునకు మాత్రమే సాధ్యం. అందుకే నాగ్ వెండితెర మన్మథుడు. మాస్, ఫ్యామిలీ, యాక్షన్, డివోషనల్ ఇలా నాగార్జున తన కెరీర్ లో అనేక ప్రయోగాలు చేశారు. 

Latest Videos


తన స్థాయి స్టార్స్ అందరూ మాస్ చిత్రాలతో దూసుకుపోతున్న టైంలో నాగార్జున అన్నమ్మయ్య చిత్రంలో నటించి తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యం నింపారు. నాగ్ నటనతో అన్నమయ్య చిత్రం ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. 

రొమాన్స్ చేసే నాగార్జున అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రానికి ఏం సరిపోతాడు అని విమర్శించిన వాళ్ళే ప్రశంసలు కురిపించారు. తాను భక్తిలోని, రక్తిలోని కింగ్ నే అని నాగార్జున నిరూపించారు. 

అన్నమయ్య చిత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా అన్నమయ్య నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భక్తికైనా, రక్తికయినా ఒకేఒక్కడు నాగార్జున. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఏడుకొండల వాడిని, షిరిడి సాయిని ప్రార్థిస్తున్నాను అని రాఘవేంద్ర రావు నాగ్ కి బర్త్ డే విషెష్ తెలిపారు. 

రాఘవేంద్ర రావు అన్నమయ్య చిత్రం గురించి గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అసలు అన్నయమ్మ తాను తీయాల్సిన చిత్రం కాదని అన్నారు. విశ్వనాథ్, బాపు, జంధ్యాల లాంటి లెజెండ్స్ చేయాలనుకున్న చిత్రం. కానీ ఆ అవకాశం నాకు వచ్చింది అని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. 

నాగార్జున అన్నమయ్య ఏంటి, సుమన్ వెంకటేశ్వర స్వామి ఏంటి అని కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కామెంట్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అన్నమయ్య చేశాం అని రాఘవేంద్ర రావు అన్నారు. 

ఒకానొక సందర్భంలో గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నమయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకరాభరణం చిత్రానికి తనకు నేషనల్ అవార్డు వస్తుంది అని ఊహించనే లేదు అని బాలు అన్నారు. కానీ ఆ చిత్రానికి అవార్డు వచ్చింది. 

అన్నమయ్య చిత్రంలో పాటలకు తనకు తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుంది అని ఊహించా. కానీ అది జరగలేదు. అవార్డు రానంత మాత్రాన నేను బాధపడలేదు. శంకరాభరణం, అన్నమయ్య రెండూ చరిత్రలో నిలిపోయాయి అని బాలు అన్నారు. 

అన్నమయ్య చిత్రం అలా నాగార్జున కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. అన్నమయ్య తర్వాత నాగ్ శ్రీరామదాసుగా కూడా మెప్పించారు. 

click me!