సీఎం విజయ్ త్రిచీ తూర్పు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఆ నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం (TVK) తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో నటుడు రాఘవా లారెన్స్ కీలక ప్రకటన చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో TVK అధినేత విజయ్ పెరంబూర్, త్రిచీ తూర్పు రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉండటంతో, సీఎం విజయ్ తన త్రిచీ తూర్పు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఈ స్థానంలో TVK అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారని అందరిలో ఆసక్తి మొదలైంది. అభ్యర్థుల రేసులో సగాయం (Sagayam), కె.పి.కృష్ణన్, నటుడు రాఘవ లారెన్స్ పేర్లు వినిపించాయి. హీరోయిన్ త్రిష కూడా పోటీ చేస్తుందన్న రూమర్స్ వచ్చాయి.
25
రాఘవ లారెన్స్ పోటీ చేస్తారా?
ఈ వార్తలపై రాఘవ లారెన్స్ స్పందించి, ఓ వివరణ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో ఓ ముఖ్యమైన అడుగు వేస్తున్నాను.. అని ఆయన ప్రకటించడంతో.., త్రిచీ తూర్పు నియోజకవర్గంలో TVK తరఫున ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైందని భావిస్తున్నారు.
35
నటుడు రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన
ఈ విషయంపై దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ఓ పోస్ట్ విడుదల చేశారు. 'ఏదీ ఆశించకుండా, మీ విధిని నిజాయితీగా నిర్వర్తించండి. నాకు మీ సలహాలు, మార్గదర్శకాలు కావాలి. నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. డబ్బు సంపాదించాలనే, ఏదైనా పదవి చేపట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నేను పూర్తిగా విశ్వసించే, నాకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, అతనికి అండగా నిలబడి, నేను వ్యక్తిగతంగా చేస్తున్న సేవ కంటే పెద్ద స్థాయిలో సమాజానికి సేవ చేయాలనేదే నా ఏకైక ఆలోచన' అని అన్నారు.
‘కానీ నేటి పరిస్థితులు నన్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేశాయి. నేను రిలీజ్ చేసిన వీడియోలో .. రాజకీయాలపై నా అవగాహన, అది నా జీవితంలోకి ఎలా ప్రవేశించింది, రాజకీయాలపై మా అమ్మ అభిప్రాయం, నా ప్రయాణాన్ని మలిచిన కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన సంఘటనలు.. ఇలా అన్నీ నా మనసులో నుంచి నిజాయితీగా, బహిరంగంగా మీతో పంచుకున్నాను’ అని లారెన్స్ తెలిపారు.
55
మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి
‘ఈ వీడియోను చివరి వరకు చూసి, మీ అభిప్రాయాలను నాతో పంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను వేస్తున్న ఈ అతి ముఖ్యమైన అడుగులో, మీ సలహాలు, మార్గదర్శకాలు నాకు గొప్ప అండగా ఉంటాయి’ అని ఆయన అన్నారు.