43 ఏళ్ల వయసులో కూడా త్రిష అంత ఎనర్జిటిక్‌గా, యంగ్‌గా, ఫిట్‌గా ఎలా ఉంటోంది? ఈ ప్రశ్నకు ఆమెనే స్వయంగా సమాధానం ఇచ్చింది. త్రిష తన అందం కోసం ఏం చేస్తుంది? ఇంతకీ ఆ రహస్యం ఏంటో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న నటి త్రిష కృష్ణన్. దళపతి విజయ్ 'లియో' సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది బ్యూటీ. త్రిషకి ఇప్పుడు 43 ఏళ్లు! కానీ, ఆమెను చూస్తే అంత వయసు ఉంటుందని ఎవరూ నమ్మలేరు.
26
త్రిష ఫిట్‌నెస్ రహస్యం
అయితే, ఈ వయసులోనూ త్రిష అంత ఎనర్జిటిక్‌గా, యంగ్‌గా, ఫిట్‌గా ఎలా ఉంటోంది? ఈ ప్రశ్నకు త్రిషనే స్వయంగా సమాధానం ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కఠినమైన వర్కౌట్ వీడియోలు షేర్ చేసి, తన ఫిట్‌నెస్ రహస్యాన్ని అభిమానులతో పంచుకుంది.
36
జిమ్ వర్కౌట్లకే పరిమితం కాలేదు..
త్రిష కేవలం సాధారణ జిమ్ వర్కౌట్లకే పరిమితం కాలేదు. ఆమె తన శరీర బలాన్ని, స్థిరత్వాన్ని పెంచుకోవడానికి 'పిలేట్స్' (Pilates) ఎంచుకుంది. ముఖ్యంగా 'పిలేట్స్ క్యాడిలాక్' (Pilates Cadillac) అనే ప్రత్యేక పరికరంతో ఆమె చేసే వ్యాయామాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇందులో తన పూర్తి శరీర బరువును చేతులపై బ్యాలెన్స్ చేస్తూ, పైకి లేస్తుంది. ఇది కోర్, నడుము, వెన్ను కండరాలను చాలా బలంగా చేస్తుంది.
త్రిష వర్కౌట్ లిస్ట్‌లో మరో కఠినమైన వ్యాయామం 'హ్యాంగింగ్ లెగ్ రైసెస్'. తల పైనున్న బార్‌ను గట్టిగా పట్టుకుని వేలాడుతూ, కాళ్లను 'L' లేదా 'V' ఆకారంలో పైకి లేపుతుంది. ఈ వ్యాయామం పొట్ట కండరాలను (Abs) టోన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది పొట్టలోని కొవ్వును తగ్గించడమే కాకుండా, బాడీ బ్యాలెన్స్, చేతుల పట్టును (Grip Strength) పెంచుతుంది. అందుకే త్రిష యాక్షన్ సీన్స్‌లో అంత ఈజీగా నటిస్తోంది.
56
కేవలం అందం కోసమే కాదు..
ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్ ప్రియులలో ఇలాంటి హ్యాంగింగ్ వర్కౌట్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి. వీటివల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగడమే కాకుండా, రోజంతా షూటింగ్‌లలో పనిచేయడం వల్ల వెన్నెముకపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కేవలం అందం కోసమే కాదని, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఈ కష్టం చాలా అవసరం అని త్రిష అంటోంది. త్రిష పడుతున్న ఈ కష్టం, ఫిట్‌నెస్‌పై ఆమెకున్న శ్రద్ధ ఇప్పటి యాక్ట్రస్ కే కాదు.. లక్షలాది అభిమానులకు కూడా స్ఫూర్తినిస్తోంది.
66
ఏజ్ ఒక నెంబర్ మాత్రమే..
'వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే' అని త్రిష మరోసారి నిరూపించింది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సరైన ట్రైనర్ మార్గదర్శకత్వం ఉంటే ఎవరైనా త్రిషలాగే ఎప్పుడూ యంగ్‌గా ఉండొచ్చు.మొత్తం మీద, 'లియో' బ్యూటీ లేటెస్ట్ ఫిట్‌నెస్ అవతార్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్రిష డెడికేషన్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు!