రాధికా ఆప్టే బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతోపాటు సమాంతర చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. మంచి పాత్ర దొరికితే చాలు భాషా బేధం లేకుండా నటించడంలో ముందేఉంటుంది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠి, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకుంటోంది. తెలుగులో `రక్త చరిత్ర` పార్ట్ `1, 2లో, `ధోని`లో,బాలకృష్ణతో `లెజెండ్`, `లయన్` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ఆకట్టుకుంది.
`అహల్య` అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి దేశ వ్యాప్తంగా ఓ కొత్త రకమైన చర్చకు తెరలేపింది. భిన్నమైన వెబ్ సిరీస్, లఘు చిత్రాలు, టెలివిజన్స్, థియేటర్స్ ఇలా అనేకమాధ్యమాల్లో తన నటనని చాటుకుంటోంది.
ఇంతగా రాణిస్తున్న రాధిక పెళ్ళి విషయంలో ఇప్పుడు సంచలన కామెంట్ చేసి తన అభిమానులను షాక్‌కి గురి చేసింది. తనకు మ్యారేజ్‌పై నమ్మకం లేదని తెలిపింది. వీసాసులభంగా వస్తుందన్న కారణంతోనే మ్యారేజ్ చేసుకున్నట్టు చెప్పింది.
ఓ ఇంటర్వ్యూలో రాధికా చెబుతూ, విదేశాల్లో ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే వీసా ఈజీగా వస్తుందని తెలుసుకుని, పెళ్ళి చేసుకున్నట్టు చెప్పింది. అయితే ప్రస్తుతం తన భర్తతోనేజీవిస్తున్నట్టు చెప్పింది.
రాధికా ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకుంది. మొదట ఆయనతో చాలా ఏళ్ళపాటు సహజీవనం చేసింది. ప్రస్తుతం లండన్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నా, సినిమాల కోసం ఎక్కువకాలం భారత్‌లోనే ఉంటోంది రాధిక.
ఇటీవల `రాత్ అకేలి హై` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే.