
ఆంధ్ర ఎలక్షన్లలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. అందుకు కారణం పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడమే. ఈ క్రమంలో పవన్ సక్సెస్ ని ఆకాంక్షిస్తూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్ సెలబ్రిటీలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ గాజు గ్లాసుకు ఓటువేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. వీరికి తోడుగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
అయితే కేవలం మన తెలుగు నటీనటులు మాత్రమే కాకుండా తమిళ సినీ పరిశ్రమ నుంచి కూడా పవన్ కు సపోర్ట్ రావటం విశేషం. వాళ్లు ఎవరో చూసేముందు ..ఇక్కడ మనవాళ్లు ఏ స్దాయిలో పవన్ గెలుపు కోసం కష్టపడుతున్నారో చూద్దాం. ఆంధ్రప్రదేశలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ, అభిమానులు కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ వ్యూహలు పన్నుతోంది.
ఈ క్రమంలో జనసేనాని (janasena) కల్యాణ్‌కు మద్దతు పెరిగింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేసారు. పవన్ కల్యాణ్ అభిమానులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్‌తోపాటు పలువురు జబర్దస్ట్ ఆర్టిస్ట్‌లు పవన్ తరుపున ప్రచారం చేసారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు భార్య పద్మజా, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
చివరి నాలుగు రోజులు పిఠాపురం తో పాటు పలు నియోజకవర్గాల్లో మెగా హీరోలు ప్రచారం ముమ్మరం చేశారు . తమ్ముడు కోసం చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. తన తమ్ముడిని గెలిపించాలంటూ ఈ వీడియో షేర్ చేశారు. ఇటీవల సీఎం రమేష్‌కు, పంచకర్ల రమేష్ మద్దతు పలికిన చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగారు. ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికి మద్దతు అనే దానిపై చిరంజీవి స్పందించలేదు. తొలిసారి తన తమ్ముడి గెలిపించాలని పిఠాపురం ఓటర్లను చిరంజీవి కోరారు.
రాజకీయ యుద్థాన్ని ఎదుర్కోనున్నారు: నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘పవన్ కల్యాణ్‌గారూ.. మీరు పెద్ద రాజకీయ యుద్థాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయి. నా మద్దతు మీకే. ఆల్ ది బెస్ట్ సర్’ అని నాని ట్వీట్ చేశారు.
ఇప్పుడు జనానికి నువ్వు కావాలి: రాజ్ తరుణ్
‘ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఒక ఆశ. మీరు గెలిచి ప్రజల తలరాతలను మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని హీరో రాజ్ తరుణ్ ఎక్స్ వేదికగా జనేసనకు సపోర్ట్ చేశారు. అలాగే పవన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు నటుడు తేజ సజ్జా తన ఇన్‌స్టా స్టోరీ పెట్టారు.
నిర్మాత నాగవంశీ కూడా పవన్ కు మద్దతు పలికారు ఆయన పిఠాపురం వెళ్లి మరీ ప్రచారంచేసారు. ఆయన భారీ మెజారిటీతో గెలవాలని వంశీ అభిలషించారు.
పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి: సంపూర్ణేష్ బాబు
"ఎన్ని అడ్డంకులు వచ్చినా .. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సదా మీ ప్రేమకి బానిస"
మీ భవిష్యత్తు కోసం ఆయన: రామ్‌చరణ్(Ram Charan)
తాజాగా రామ్‌చరణ్ కూడా పవనకు మద్దతుగా ట్వీట్ చేశారు. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవనకల్యాణ్‌గారిని గెలిపించండి’ అని ట్విట్టర్ వేదికగా ఓటర్లను కోరారు.
హీరో తేజ సజ్జా కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక ఫోటోని షేర్ చేశాడు. ముందు ఉన్న బిగ్ డే కోసం పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ చెబుతున్నాను. సార్ దయచేసి మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోని ఆయన షేర్ చేశాడు.
ఇప్పుడు ప్రముఖ నటుడు, అభిమానులు గ్లోబర్ స్టార్ గా పిలుచుకునే రామ్ చరణ్ ఈరోజు పిఠాపురంలో జనసేన అధినేత, రామ్ చరణ్ కి బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ ని కలిశారు. రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి వెళ్లి బాబాయి పవన్ కళ్యాణ్ ని కలిసి తన సంఘీభావం తెలిపారు.రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఆ తరువాత అక్కడికి వచ్చిన అభిమానులకి అభివాదం చేశారు. ఎంతో మంది జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు పిఠాపురం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ వారు ఉంటున్న ఇంటిపైనుండే అభివాదం చెయ్యడం, అభిమానులు అందరూ ఆనందడోలికల్లో మునగడం కనిపించింది.
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా పవన్ కళ్యాణ్‌కు మద్ధతు లభిస్తోంది. సలార్ ఫేమ్ శ్రీయారెడ్డి ఆయనకు అండగా నిలిచారు. ఆయన కోరుకున్నది జరగాలని, పవన్‌కు విజయం దక్కాలని.. గాజు గ్లాసుకు ఓటేయాలని శ్రీయారెడ్డి ట్వీట్ చేశారు. ఆమె ప్రస్తుతం సలార్ 2లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే పవన్-సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఓజీ'లో డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్‌లో శ్రీయారెడ్డి కనిపించనున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ చిరంజీవికి హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాధిక శరత్ కుమార్ సైతం పవన్‌కు సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు.. మీ సేవ ప్రజలకు మరింత బలం చేకూర్చాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.