పవన్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లలో టాప్ ఎవరు? చిరంజీవి స్థానం ఎవరిది? ఇవిగో లెక్కలు!

Published : May 12, 2024, 09:03 AM IST

మెగా హీరోల్లో టాప్ ఎవరు? ఈ చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. చిరంజీవి తర్వాత ఆ స్థానం ఎవరిదనే ఆసక్తి జనాల్లో ఉంది. బాక్సాఫీస్ లెక్కలు, స్టార్డం పరిశీలిస్తే నెంబర్ వన్ ఎవరో తేలిపోయింది.   

PREV
110
పవన్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లలో టాప్ ఎవరు? చిరంజీవి స్థానం ఎవరిది? ఇవిగో లెక్కలు!

చిరంజీవి దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను ఏలారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి స్టార్ హీరో అయ్యారు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరంటే చిరంజీవి పేరు వినిపించేది. ఇక తన వారసులకు ఒక మార్గం వేశారు. 
 

210
Mega Family


చిరంజీవి నట వారసులుగా అరడజనుకు పైగా హీరోలు వచ్చారు. దాదాపు అందరూ సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ టైర్ టు హీరోలుగా సత్తా చాటుతున్నారు. 
 

310
Allu Arjun Pawan Kalyan Ram charan

మెగా అభిమానులో మరలా చీలికలు ఉన్నాయి. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సపరేట్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. వీరి మధ్య కూడా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. అల్లు అర్జున్ - రామ్ చరణ్, రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్- పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ జరిగిన సందర్భాలు అనేకం. 
 

410
Pawan Kalyan


ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. మెగా హీరోల ఫ్యాన్స్ విడిపోయి స్పేస్ లో పెట్టుకొని బండ బూతులు తిట్టుకున్నారు. దారుణమైన ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు రాజేసింది. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురంలో దిగిపోయారు. ప్రచారం చేశారు. 

510


అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి తన మద్దతు ప్రకటించాడు. కానీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న చివరి రోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కి తన మద్దతు ప్రకటించాడు. ఈ పరిణామం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. అదును చూసి దెబ్బకొట్టాడని అల్లు అర్జున్ పై ట్రోల్ షురూ చేశారు. 

610

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్-రామ్ చరణ్ లలో ఎవరు టాప్ అనే వాదన తెరపైకి వచ్చింది. గత మూడు నాలుగేళ్ళ పరిణామాలు పరిశీలిస్తే.. పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఫోకస్ తగ్గించారు. ఏదో డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నట్లుగా ఉంది.
 

710
Mega heroes

పవన్ కళ్యాణ్ చేసే రీమేక్స్ మీద ఆయన ఫ్యాన్స్ కి కూడా ఆసక్తి లేని పరిస్థితి. వకీల్ సాబ్ మినహాయిస్తే భీమ్లా నాయక్, బ్రో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఆయన సినిమాలకు ఆదరణ తగ్గుతూ వస్తుంది. కాబట్టి ప్రస్తుతం మెగా హీరోల్లో ఆయన టాప్ కాదనే వాదన ఉంది. 
 

810
Allu Arjun Ram Charan

ఇక ప్రధాన పోటీ అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్యే. ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి సినిమా కాబట్టి హీరోలకు పూర్తి క్రెడిట్ ఇవ్వలేం. ఇండియాలో రామ్ చరణ్ క్రేజ్ ఏంటో తెలియాలంటే గేమ్ ఛేంజర్ విడుదల కావాలి. 
 

910

అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో ఓ రేంజ్ లో ఉంది. పుష్ప 2 థియేట్రికల్ హక్కులు ప్రభాస్ కల్కి కంటే ఎక్కువ కావడం విశేషం. రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో సమానంగా కేరళలో అభిమానులు ఉన్నారు. పుష్ప 2 సక్సెస్ అయితే అల్లు అర్జున్ రేంజ్ ని అంచనా కూడా వేయలేం. 

 

1010

మెగా హీరోల్లో ఎవరు టాప్ అనేది గేమ్ ఛేంజర్ - పుష్ప 2 తేల్చేయనున్నాయి. ఈ చిత్రాల సక్సెస్ ఇది నిర్ణయిస్తుంది. నార్త్ ఇండియాలో ఎవరి చిత్రానికి ఎక్కువ ఆదరణ దక్కుతుందో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ... 

Read more Photos on
click me!

Recommended Stories