రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్... చీకటి బాగోతం బట్టబయలు!

Published : May 12, 2024, 07:36 AM IST

పల్లవి ప్రశాంత్ చీకటి బాగోతం బట్టబయలు అయ్యింది. అతడు రైతుల మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో గురు శిష్యులు పల్లవి ప్రశాంత్, శివాజీలను ఏకి పారేస్తున్నారు జనాలు.   

PREV
18
రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్... చీకటి బాగోతం బట్టబయలు!
Pallavi Prashanth


బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు పల్లవి ప్రశాంత్. ఒక సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టి తన ఆటతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఒదిగి ఉండే పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఫైర్ అయ్యేవాడు. ఇక టాస్క్ లలో సత్తా చాటేవాడు. 

28
Bigg boss fame Pallavi Prashanth

మొదట్లో తడబడ్డ రైతుబిడ్డ మెల్లగా మెరుగయ్యాడు. టాప్ సెలెబ్స్ ని కాదని టైటిల్ విన్నర్ అయ్యాడు. కాగా బిగ్ బాస్ హౌస్లో పల్లవిప్ ప్రశాంత్ ఒక మాట ఇచ్చాడు. తాను టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు పంచుతానని హామీ ఇచ్చాడు. 

 

38
Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ కి ప్రైజ్ మనీ రూపంలో రూ. 35 లక్షలు వచ్చాయి. ఇక బహుమతులుగా రూ. 15 లక్షల విలువైన కారు, రూ. 15 లక్షల విలువైన బంగారు హారం ఇచ్చారు. జాస్ అలుకాస్ బహుమతిగా ఇచ్చిన నెక్లెస్ పల్లవి ప్రశాంత్ చేతికి వచ్చింది. ఇటీవల ఆ సంస్థ పల్లవి ప్రశాంత్ కి ఆ బహుమతి అందజేసింది. 

48
Pallavi Prashanth

అంతా బాగానే ఉంది. కానీ పల్లవి ప్రశాంత్ మాట నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడనే వాదన మొదలైంది. బిగ్ బాస్ షో ముగిసి నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ డబ్బులు పేద రైతులకు చెల్లించలేదు. 

 

58

ఒక లక్ష రూపాయలు మాత్రం పంచిన పల్లవి ప్రశాంత్ పెద్ద హనంగా చేశాడు. తన గురువు శివాజీతో పాటు వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. కట్ చేస్తే ఆ సహాయం హేసి రెండు నెలలు అవుతున్నా మరో సాయం చేయలేదు. 
 

68
Pallavi Prashanth

మరోవైపు పల్లవి ప్రశాంత్ భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే రూ. 2 లక్షలకు పైగా తీసుకుంటున్నాడట. పల్లవి ప్రశాంత్ సంపాదన నెలకు రూ. 20 నుండి 30 లక్షలు అంటున్నారు. 
 

78
Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట తప్పాడని అంటే గురువు శివాజీకి కోపం వచ్చింది. రాజకీయ నాయకులను కూడా ఇలానే నిలదీస్తారా అంటూ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ పంచకుండా ఉన్న పల్లవి ప్రశాంత్ ని మాత్రం ప్రశ్నించడం లేదు. 

 

88

ఇక సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో పల్లవి ప్రశాంత్, శివాజీలను జనాలు ఏకి పారేస్తున్నారు. పేద రైతులకు ఎప్పుడు డబ్బులు పంచుతున్నారు? అసలు పంచుతారా లేదా? అని నిలదీస్తున్నారు. మరి పల్లవి ప్రశాంత్, శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి... 

click me!

Recommended Stories