RadheShaym: పిడుగులాంటి దెబ్బతో రాధేశ్యామ్ బడ్జెట్ 100 కోట్లు పెరిగిందా.. ఆ దారుణం ఊహించలేక..

First Published Jan 14, 2022, 10:39 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే నేడు జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలయ్యేది. కానీ అలా జరగలేదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే నేడు జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలయ్యేది. కానీ అలా జరగలేదు. ప్రమాదకరంగా మారుతున్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనవరి 7న విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడింది. దీనిని ఫాలో అవుతూ రాధేశ్యామ్ కూడా వాయిదా పడింది. దీనితో ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పలేదు. 

రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడే కొద్దీ నిర్మాతలకు భారం పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. దీనితో బడ్జెట్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. తాజాగా బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రాధే శ్యామ్ బడ్జెట్ మరో వంద కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. 

పెరిగిన వందకోట్లు నిర్మాతలకు అదనపు భారమే తప్ప సినిమా వ్యయంలో భాగం కాదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ ఈ చిత్రానికి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. హీరోయిన్, ఇతర నటీనటుల పారితోషికం 25 కోట్లు. దర్శకుడు 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అంటే రెమ్యునరేషన్స్ కి అయిన మొత్తం 200 కోట్లు. 

ఈ చిత్రంలో టైటానిక్ తరహాలో భారీ షిప్ సన్నివేశం, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ 100 కోట్ల వరకు ఐంది. మొత్తంగా సినిమాకు అయిన బడ్జెట్ 300 కోట్లు. కానీ టోటల్ బడ్జెట్ 400 కోట్లు దాటేసింది వార్తలు వస్తున్నాయి. ఈ వంద కోట్ల భారం ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ప్రశ్న. అయితే దీని గురించి ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. 

బాలీవుడ్ మీడియాలో  క్రిటిక్స్ చెబుతున్న దానిప్రకారం.. ఈ వందకోట్ల భారం రాధే శ్యామ్ ఫారెన్ షెడ్యూల్ లో కోవిడ్ కారణంగా పడినట్లు తెలుస్తోంది. ఇటలీ లాంటి దేశాల్లో రాధేశ్యామ్ చిత్రాన్ని చిత్రీకరించారు. కోవిడ్ టైం లో  షూటింగ్ జరిగింది. దీనితో నిర్మాతలు జాగ్రత్తగా వ్యవహరించారట. ప్రధాన నటీనటుల్లో ఎవరైనా కోవిడ్ బారిన పడితే సినిమాని వాయిదా వేయక తప్పదు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వాయిదా పడితే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. బడ్జెట్ కంట్రోల్ చేయలేని విధంగా పెరుగుతుంది. 

సో ఆ దారుణాన్ని ఊహించలేక నిర్మాతలు ఫారెన్ షెడ్యూల్ లో ఓ స్టార్ హోటల్ మొత్తాన్ని చిత్ర యూనిట్ కి బుక్ చేశారట. విజిటర్స్ ఎవరిని అనుమతి ఇవ్వకుండా కొన్ని రోజుల పాటు హోటల్ మొత్తం రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కే అంకితం చేశారు. హోటల్ లో ఒక ఫ్లోర్ మొత్తం ప్రభాస్ కి నిర్మాతలు కేటాయించారట. అలా కోవిడ్ టైంలో చిత్ర యూనిట్ వసతి నిర్మాతలు భారీ మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. దీనితో రాధే శ్యామ్ బడ్జెట్ మరో 100 కోట్లు పెరిగినట్లు చెబుతున్నారు. 

రాధే శ్యామ్ చిత్రం ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ మూవీలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. ఇతరుల చేతిరాతలు చూసి వారి లైఫ్ లో ఏం జరుగుతుందో ముందే పసిగట్టగలడు. అలాంటిది తన జీవితాన్ని, ప్రేమని ప్రభాస్ ముందే ఊహించాడా అనేది ఈ చిత్ర కథాంశం.  

click me!