Keerthy Suresh Pics : మహానటి ఫోజులకు ఫిదా అయిన రాశీఖన్నా.. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది..

Published : Mar 23, 2022, 11:32 AM IST

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ స్టైలిష్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఈ బ్యూటీ అక్కడ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. ఆ ఫొటోలను తన అభిమానులతో ఇన్ స్టాలో పంచుకుంది.

PREV
16
Keerthy Suresh Pics : మహానటి ఫోజులకు ఫిదా అయిన రాశీఖన్నా.. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది..

కీర్తి సురేష్ తెలుగులో తొలిసారి టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన ‘నేను శైలజ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. నేచురల్ స్టార్ నాని (Nani)తో కలిసి నేను లోకల్ మూవీలో నటించి ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది.  

26

ఆ తర్వాత మహానటి`గా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకుంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌(Keerthy Suresh). ఇందులో అద్భుతమైన నటనతో యావత్‌ సౌత్‌ ఇండియన్‌ ఆడియెన్స్‌ ని అలరించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది.

36

అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్‌ లేటెస్ట్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ హల్ చల్  చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలకు హీరోయిన్ రాశీఖన్నా (Raashi Khanna) కామెంట్ చేయడంతో మరింత వైరల్ గా మారుతోంది.
 

46

ఈ ఫొటోల్లో దుప్పట్టాలేకుండానే ఫుల్ లెన్త్ టాప్ లో స్టైలిస్ లుక్ ను సొంతం చేసుకుంది. సన్ గ్లాసెస్ ధరించి మందహాసంతో అక్కడి అభిమానులకు మహానటి ఫోజులతో మతిపోగొట్టింది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని దోచుకుంటోంది.

56

అయితే తన స్నేహితురాలి పెళ్లికి హాజరైన కీర్తిసురేష్ అక్కడ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ ఫంక్షన్ లో అట్రాక్టివ్ గా నిలిచింది. నూతన వధూవరులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 

66

కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దసరా’ మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కొత్త సినిమాని ప్రారంభించుకుంది. ఇప్పటికే ఆమె తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

click me!

Recommended Stories