అంతటితో ఆగలేదు. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా పవర్ ప్యాక్డ్ స్టోరీ అని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ చేస్తుందన్నారు. ప్రొడక్షన్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటుందన్నారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేస్తుందని, ప్రతి ఒక్క నటుడు తన అత్యుత్తమ నటనని ప్రదర్శించారని, ఈ సినిమాతో రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోతారని, `ఆర్‌ఆర్‌ఆర్` ఒక సినిమాటిక్ సాగా` అంటూ `ఆర్‌ఆర్‌ఆర్`ని ఆకాశానికి ఎత్తేశాడు. అజయ్ దేవగన్ సర్‌ప్రైజ్ చేస్తాడని, అలియా మెరుపులు హైలైట్‌గా నిలుస్తాయని, ఆమె చాలా అందంగా ఉందని వెల్లడించారు. సినిమాకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.