కలెక్టర్‌ కావాలని కలలు కని హీరోయిన్‌ అయ్యింది, అవకాశాలు తగ్గి అల్లాడిపోతున్న ఈ నటి ఎవరో తెలుసా?

Published : Jul 05, 2025, 08:43 AM IST

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యామని చాలా మంది స్టార్స్ చెబుతుంటారు. కానీ ఈ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కలెక్టర్‌ కాబోయి హీరోయిన్‌ అయ్యింది. ఆమె ఎవరో ఓ లుక్కేద్దాం. 

PREV
15
కలెక్టర్‌ కావాలనుకొని హీరోయిన్‌ అయిన నటి

హీరోయిన్లు చాలా మంది సినిమాల్లోకి రావాలని చిన్నప్పుడు అనుకోరు. వేరే రంగంలో రాణించాలనుకుంటారు. కానీ అనూహ్యంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చి సక్సెస్‌ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. 

సౌందర్య ఎప్పుడూ తాను మూవీస్‌లోకి రావాలని అనుకోలేదు. డాక్టర్‌ కావాలనుకుంది. కానీ తండ్రి కారణంగా సినిమాల్లోకి వచ్చింది. అలానే మొన్నటి వరకు స్టార్‌ హీరోయిన్‌గా రాణించి ఇప్పుడు అవకాశాల కోసం వేచి చూస్తున్న ఓ హీరోయిన్‌ కాలేజీ రోజుల్లో కలెక్టర్‌ కావాలనుకుందట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్‌ గా ఎదిగింది. 

25
ఐఏఎస్‌ కొట్టాలని కలలు కన్న రాశీఖన్నా

సివిల్స్ లో ఐఏఎస్‌ ర్యాంక్‌ కొట్టి కలెక్టర్‌ ఛైర్‌లో కూర్చోవాలనుకున్న హీరోయిన్‌ ఎవరో కాదు రాశీఖన్నా. ఆమె చిన్నప్పుడుగానీ, కాలేజీకి వచ్చాక కూడా ఎప్పుడూ తాను హీరోయిన్‌ కావాలని, సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. 

కాలేజీ రోజుల్లో సివిల్స్ ప్రిపేర్‌ కావాలని, ఐఏఎస్‌ కొట్టాలని కలలు కన్నదట. కానీ అనుకోకుండా ఆమె మోడలింగ్‌ వైపు వెళ్లింది. అక్కడ బాగా రాణించింది. మంచి కమర్షియల్‌ యాడ్స్ చేసింది.

 దీంతో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. యాడ్స్ లో చూసిన మేకర్స్ ఆమెని అప్రోచ్‌ అయ్యారు. సినిమా ఆఫర్లు చేశారు. ఆడిషన్స్ లో ఎంపికైంది. అంతే హీరోయిన్‌ అయిపోయింది.

35
తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రాశీఖన్నా

ఢిల్లీకి చెందిన రాశీఖన్నా 2013లో `మద్రాస్‌ కేఫ్‌` అనే హిందీ మూవీతో నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అది విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. `మనం`లో గెస్ట్ గా మెరిసింది. 

`ఊహలు గుసగుసలాడే` చిత్రంతో హీరోయిన్‌ అయిపోయింది. తొలి చిత్రం హిట్‌ కావడంతో, అందరిని ఆకట్టుకునేలా ఆమె ఉండటంతో మేకర్స్ ఆఫర్లతో క్యూ కట్టారు. `జోరు`, `జిల్‌`, `శివం`, `బెంగాల్‌ టైగర్‌`, `సుప్రీమ్‌`, `హైపర్‌`, `జైలవకుశ`, `ఆక్సిజన్‌`, `టచ్‌ చేసి చూడు`, `తొలిప్రేమ`,

 `శ్రీనివాస కళ్యాణం`, `వెంకీ మామ`, `ప్రతి రోజు పండగే`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `పక్కా కమర్షియల్‌`, `థ్యాంక్యూ` వంటి చిత్రాలు చేసింది. మంచి విజయాలే అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

45
బిగ్‌ స్టార్స్ తో చేయలేకపోయిన రాశీఖన్నా

అయితే రాశీఖన్నా ఎక్కువగా సెకండ్‌ రేంజ్‌ హీరోలతోనే చేసింది. ఒక్క ఎన్టీఆర్‌తో `జైలవకుశ`లో మెరిసింది. ఈ మూవీ బాగానే ఆడినా, ఆ తర్వాత రాశీఖన్నా నటించిన చిత్రాలు పెద్దగా ఆదరణ పొందలేదు. అదే సమయంలో ఆమె ఇతర భాషల్లో ఫోకస్‌ చేసింది. 

అటు హిందీ, తమిళంలోనూ సినిమా ఆఫర్లు అందుకుంది. దీంతో తెలుగులో ఆఫర్లు తగ్గాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో `తెలుసు కదా` మూవీలో నటిస్తుంది. ఇది తప్ప ఆమె చేతిలో కొత్త సినిమాలు లేవు. ఆఫర్ల కోసం ఇప్పుడు అల్లాడిపోతుంది.

55
ఆఫర్ల కోసం వేచి చూస్తున్న రాశీఖన్నా

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. గ్లామర్‌ ఫోటోలతో మేకర్స్ దృష్టిలో పడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తనదైన ట్రీట్‌తో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. మంచి ఆఫర్ల కోసం వేచి చూస్తోంది.

గ్లామర్‌ సైడ్ కూడా తాను సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. అదే సమయంలో బలమైన పాత్రలతోనూ మెప్పించేందుకు రెడీగా ఉంది రాశీఖన్నా. మరి ఇకనైనా ఈ ఢిల్లీ అమ్మడు పుంజుకుంటుందా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories