NTR-Krishna: ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్‌ మూవీని ఫ్రీమేక్‌ చేసి చావు దెబ్బతిన్న సూపర్‌ స్టార్‌ కృష్ణ

Published : Jul 05, 2025, 07:38 AM IST

ఎన్టీ రామారావుకి మాస్‌ కమర్షియల్‌ సినిమాల పరంగా పోటీ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆయన మూవీనీ ఫ్రీమేక్‌ చేసి ఘోర పరాజయాన్ని ఫేస్‌ చేశారు. 

PREV
15
ఎన్టీఆర్‌ మూవీని కాపీ కొట్టిక కృష్ణ

ఎన్టీఆర్‌కి, సూపర్‌ స్టార్‌ కృష్ణకి మధ్య అప్పట్లో బాగానే వార్‌ జరిగేది. సినిమాల పరంగా సైలెంట్‌ వార్‌ నడిచేది. ఎన్టీఆర్‌ పౌరాణికాలు, జానపదాలతోపాటు మాస్‌ యాక్షన్‌ మూవీస్‌ చేసేవారు. ఏఎన్నార్‌  సాంఘీకాలు, ప్రేమగాథలు, కుటుంబ కథా చిత్రాలతో మెప్పించారు. 

కానీ ఆ సమయంలో రామారావుకి కమర్షియల్‌ యాక్షన్‌ మూవీస్‌ పరంగా పోటీ ఇచ్చింది సూపర్‌ స్టార్‌ కృష్ణ అనే చెప్పాలి. అంతేకాదు రామారావుకి పోటీగా మూవీస్‌ చేసి మెప్పించారు. ఘన విజయాలు సాధించారు. కానీ ఓ మూవీ విషయంలో సూపర్‌ స్టార్‌ గట్టిగా దెబ్బతిన్నారు.

25
ఎన్టీఆర్‌ `అన్నదమ్ముల అనుబంధం` పెద్ద హిట్‌

ఎన్టీఆర్‌ 1970లోనే రీమేక్‌ల బాట పట్టారు. బాలీవుడ్‌ చిత్రాలను బాగా రీమేక్ చేశారు. అలా చేసిన రీమేక్‌ చిత్రమే `అన్నదమ్ముల అనుబంధం`. ఇది హిందీలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ధర్మేంద్ర నటించిన `యాదోంకీ బారాత్‌` చిత్రానికి రీమేక్‌. 

ఇందులో ఎన్టీఆర్‌ అన్నగా నటించగా, తమ్ముళ్లుగా మురళీ మోహన్‌, బాలకృష్ణ నటించారు. ఈ మూవీకి ఎస్‌ డి లాల్‌ దర్శకత్వం వహించగా, పీతాంబరం నిర్మించారు. 1974 జులై 4న ఈ మూవీ విడుదలైంది. 

అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీ 9 సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది.ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

35
ఎన్టీఆర్‌ మూవీని ఫ్రీమేక్‌ చేసిన కృష్ణ

ఇదే చిత్రాన్ని కృష్ణ ఫ్రీమేక్‌ చేశారు. ఇదే కథని కొన్ని మార్పులు చేసి `రక్త సంబంధాలు` పేరుతో రూపొందించారు. ఏడాది గ్యాప్‌తోనే ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. నవ చిత్ర ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై రాఘవమ్మ, మీనాక్షిలు నిర్మించారు. ఎం మల్లికార్జున రావు దర్శకత్వం వహించారు. 

ఎన్టీఆర్‌ `అన్నదమ్ముల అనుబంధం`లో అన్నా తమ్ముళ్లు ఉంటారు, కానీ సూపర్‌ స్టార్‌ దాన్ని కాస్త అన్న, చెల్లి అనుబంధంగా మార్చేశారు. కృష్ణతోపాటు మంజుల, లత నటించారు. 1975లో వచ్చిన ఈ మూవీ  పరాజయం చెందింది. 

సూపర్‌ స్టార్‌ని చావు దెబ్బ కొట్టింది. ఆ ఏడాది ఆయన నటించిన మూవీస్‌ అన్నీ పెద్దగా ఆడలేదు. దీంతో ఇలా ఫ్రీమేక్‌తో అయినా హిట్‌ కొట్టాలనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్‌ కాలేదు. బాగా డిజాప్పాయింట్‌ చేసింది.

45
ఎన్టీఆర్‌కి పోటీగా కృష్ణ సినిమాలు

ఆ తర్వాత మరోసారి `దాన వీర శూర కర్ణ`కి పోటీగా `కురుక్షేత్రం` తీసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూవీస్‌ చేసి విజయాలు అందుకున్నారు. 

ఆ సమయంలో టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు కృష్ణ. ఇలా డేరింగ్‌, అండ్‌ డాషింగ్‌ హీరోగా నిలిచిన సూపర్‌ స్టార్‌ కొన్నిసార్లు ఆవేశానికి పోయి బోల్తా పడ్డారు. అదేసమయంలో కొన్ని రామారావుని కాదని తీసి విజయాలు అందుకున్నారు.

55
ఎన్టీఆర్‌తో కలిసి సూపర్‌స్టార్‌ చేసిన మూవీస్‌

అదే సమయంలో ఎన్టీఆర్‌తోనూ కలిసి చాలా సినిమాలే చేశారు కృష్ణ. `వయ్యారి భామలు వగలమారి భర్తలు`, `విచిత్ర కుటుంబం`, `నిలువు దోపిడి`, `శ్రీ జన్మ`, `దేవుడు చేసిన మనుషులు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 

అన్నదమ్ములుగానూ నటించి ఆకట్టుకున్నారు. సినిమాల పరంగా వీరి మధ్య ఎంత గొడవ ఉన్నా, వ్యక్తులుగా మాత్రం ఇద్దరి మధ్య మంచి స్నేహం, అనుబంధం ఉందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories