తన జీవితంలో లవ్‌, లైట్‌ ఎవరో సీక్రెట్‌ చెప్పేసిన రాశీఖన్నా..

First Published | Feb 27, 2021, 2:06 PM IST

బొద్దు గుమ్మ రాశీఖన్నా ఇటీవల కాస్త స్లిమ్‌గా మారింది. నాజుకైనా అందాలతో కిర్రాక్‌ పుట్టిస్తుంది. తాజాగా ఓ సీక్రెట్‌ చెప్పేసింది రాశీ. తన జీవితంలో లవ్‌, లైట్‌ ఎవరో చెప్పేసింది. అన్నీ అతనే అని కుండబద్దలు కొట్టింది. ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేస్తుంది. లేటేస్ట్ ఫోటోలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరించింది. 

రాశీఖన్నా తెలుగులో సినిమాలు తగ్గించింది. ఆమె తగ్గించిందా? ఛాన్స్ లు రావడం లేదా? అన్నది పక్కన పెడితే ఈ అమ్మడు వెండితెరపై కనిపించి ఏడాది దాటిపోయింది.
తాను ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రేమికుడి కోసం వెయిట్‌ చేస్తున్నానని ఓ మధ్య పలు ఇంటర్వ్యూలో చెప్పింది రాశీ. కానీ తాను ఇప్పటికీ కమిట్‌ కాలేదని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో తన లవ్‌, లైట్‌కి సంబంధించిన సీక్రెట్స్ రివీల్‌ చేసిందీ హాట్‌ బ్యూటీ. నెఫ్యూకి చెందిన చిన్న పిల్లాడికి ముద్దు పెడుతున్న ఫోటోలను పంచుకుంది.
ఇందులో `లవ్‌ అండ్‌ లైట్‌ ఆఫ్‌ మై లైఫ్‌` అని పేర్కొంది. ఈ సందర్భంగా అబ్బాయి పేరు నీల్‌ అని చెబుతూ, నెఫ్యూ లవ్‌ అని పేర్కొంది.
రాశీ చెప్పినదాన్ని ప్రకారం ఇప్పటి వరకు తన జీవితంలో ప్రేమ, కాంతి ఏదైనా ఉందంటే అది ఈ చిన్నపిల్లాడే అని రాశీ చెప్పింది.
అదే సమయంలో తాను ఇంకా సింగిల్‌గానే ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. తన జీవితంలో లవర్‌ పోస్ట్ ఇంకా ఖాళీగా ఉందని బహిర్గతం చేసింది రాశీ.
రాశీఖన్నా చివరగా విజయ్‌ దేవరకొండతో `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లో నటించింది. ఆ తర్వాత ఇప్పుడు తమిళంలో `తుగ్లక్‌ దర్బార్‌`, `అరన్మనై 3`, `మేథావి` చిత్రాల్లో నటిస్తుండగా, మలయాళంలో `బ్రామమ్‌` సినిమాలో నటిస్తుంది. తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. హిందీలో రాజ్‌ అండ్‌ డీకే డైరెక్షన్‌లో షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది రాశీ. ఇదిలా ఉంటే ఇటీవల స్లిమ్‌గా మారి హాట్‌ అందాలను ఆరబోస్తుంది. స్విమ్మింగ్‌ ఫూల్‌లో బికినీ పోజుచ్చి పిచ్చెక్కించింది రాశీ.

Latest Videos

click me!