యాంకరింగ్ హద్దులను చెరిపేసి కొత్త పద్ధతులు పరిచయం చేశారు... రష్మీ, అనసూయ. బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన ఘనత వారిదే. వాళ్ళ వారసులుగా ఎంట్రీ ఇస్తున్నవారు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు.
రష్మీ, అనసూయల తరువాత బుల్లితెర యాంకర్స్ గా వెలుగులోకి వచ్చిన శ్రీముఖి, విష్ణు ప్రియ మరియు వర్షిణి పొట్టి దుస్తులలో బుల్లితెరపై గ్లామర్ పంచుతున్నారు.
కాగా స్టార్ మా ఇటీవల కామెడీ స్టార్స్ పేరుతో ఓ కామెడీ షో ప్రారంభించారు. బిగ్ బాస్ సెలెబ్రిటీలతో పాటు, ఒకప్పటి జబర్ధస్త్ కమెడియన్స్ చంద్ర, ముక్కు అవినాష్ వంటి వారు లీడర్స్ గా ఈ షోలో ఉన్నారు.
స్టార్ కమెడియన్స్ షోకి యాంకర్ గా వర్షిణి వ్యవహరిస్తున్నారు. జబర్ధస్త్ మాదిరే... కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో యాంకర్ కి ఓ మాంచి మాస్ సాంగ్ తో ఎంట్రీ ఉంటుంది. తాజా ఎపిసోడ్ కోసం వర్షిణి ఎంచుకున్న పాట, ధరించిన డ్రెస్, వేసిన స్టెప్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి.
రేసు గుఱ్ఱం మూవీలోని 'డౌన్ డౌన్ డుప్పా' సాంగ్ కి వర్షిణి... ఐటెం హీరోయిన్స్ కి మించిన హాట్ స్టెప్స్ తో ఇరగదీశారు. రష్మీ, అనసూయ కూడా ఈ రేంజ్ లో డాన్స్ చేసి ఉండరని ఆమె పెర్ఫార్మన్స్ చూస్తే అర్థం అయ్యింది.
ఢీ షో నుండి తొలగించబడ్డ వర్షిణి.. కామెడీ స్టార్స్ ప్రోగ్రాం సక్సెస్ చేయడం కోసం తన వంతు కృషి చేస్తున్నారని అనిపిస్తుంది.
అలాగే షో జడ్జిగా ఉన్న శేఖర్ మాస్టర్ తో కూడా వర్షిణి రొమాన్స్, సంభాషణలు సరదా పంచుతున్నాయి.
మొత్తంగా వర్షిణి స్టార్ కమెడియన్స్ షోకి పాపులారిటీ తేవడం కోసం తీవ్రంగానే కష్టపడుతున్నారు.
చమ్మక్ చంద్ర, అవినాష్, ఆషురెడ్డి, సుజాత, అరియనా వంటి వారు పాల్గొంటున్న ఈ షోకి ఆదరణ బాగానే ఉందని సమాచా
ఈ షో సక్సెస్ అయిన నేపథ్యంలో వర్షిణి కెరీర్ కొంచెం గాడిన పడ్డట్లు అవుతుంది. మరి చూద్దాం జబర్ధస్త్ కి ఈ షో ఎంత వరకు పోటీ ఇవ్వగలదో...