కాజల్‌ ఇంట్లో రాశీఖన్నా సందడి.. నీల్‌ కిచ్లుతో బొమ్మలాట.. ఫ్రేమ్‌ అదిరిపోయింది!

Published : Oct 15, 2023, 01:48 PM IST

ఇద్దరు అందాల భామలు ఒకే ఫ్రేములోకి వస్తే.. ఇద్దరు బ్యూటీస్‌ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. అలాంటి ట్రీట్‌ని తన అభిమానులకు ఇచ్చారు ఇద్దరు బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ రాశీఖన్నా, కాజల్‌.   

PREV
17
కాజల్‌ ఇంట్లో రాశీఖన్నా సందడి.. నీల్‌ కిచ్లుతో బొమ్మలాట.. ఫ్రేమ్‌ అదిరిపోయింది!

రాశీఖన్నా.. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె కాజల్‌ కొడుకు నీల్‌ కిచ్లుతో ఆడుకుంటున్న ఫోటో ఒకటి. మరోటి కాజల్‌, రాశీఖన్నా, నీల్‌ కిచ్లు కలిసి దిగిన ఫోటో. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

27

ఇందులో కాజల్‌ ఇంటికి వెళ్లింది రాశీఖన్నా. అంతేకాదు నీల్‌ కిచ్లుతో బొమ్మలాట ఆడుకుంది. ఇద్దరు ఇలా ఫ్లోర్‌పై కూర్చొని బుజ్జి కార్లతో ఆడుకుంటున్న తీరు ముచ్చటేస్తుంది. తాజాగా ఈ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. వైరల్‌ అవుతుంది. ఇందులో నీల్‌ కిచ్లు ఎంతో క్యూట్‌గా, బబ్లీగా కనిపిస్తున్నాడు. దీనికితోడు ఇద్దరు అందాల భామలు కలవడంతో ఫ్రేమ్‌ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ సందడి చేస్తున్నాయి. అందరిని అలరిస్తున్నాయి. 

37

ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్న రాశీఖన్నా తన సంతోషాన్ని పంచుకుంది. ఈ రోజుకి చాలా కృతజ్ఞతలు. ఎట్టకేలకు ఈ ఆనందపు మూటను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నీల్‌` అని పేర్కొంది. ఈ సందర్భంగా కాజల్‌ని ట్యాగ్‌ చేసింది. 

47

దీనికి కాజల్‌ స్పందించింది. రాశీని ఆకాశానికి ఎత్తేసింది. `నువ్వు మనోహరమైన, ప్రకాశవంతమైన ప్రామాణికమైన, అందమై, అత్యంత పాజిటివ్‌ ఎనర్జీ కలిగిన దివ్యమైన అమ్మాయివి. చివరికి మనం కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు మీతో ప్రేమలో పడిపోయారు` అని పేర్కొంది. 

57

కాజల్‌ ప్రస్తుతం `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తుంది. బాలయ్యతో తొలిసారి చేసింది. ఈ చిత్రం ఈ నెల 19న రాబోతుంది. ఇక రాశీఖన్నా చివరగా గతేడాది `సర్దార్‌`, `థ్యాంక్యూ`, `పక్కా కమర్షియల్‌` వంటి సినిమాల్లో మెరిసింది. ఇప్పుడు హిందీలో `యోధ`, తమిళంలో `అరణ్మనై 4`, `మేథావి` చిత్రాలు చేస్తుంది. 
 

67
Raashi Khanna

అయితే కొత్తగా రాశీఖన్నాకి తెలుగులో సినిమాలు లేకపోవడం గమనార్హం. ఆమెకి చివరగా చేసిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. దీంతో ఆ ప్రభావం కెరీర్‌పై పడుతుంది. అంతేకాదు తాను కూడా సెలక్టీవ్‌గా వెళ్తుందని తెలుస్తుంది. 
 

77

దీనికితోడు కొత్త భామల జోరు కూడా రాశీఖన్నా కెరీర్‌ని ప్రభావితం చేస్తున్నాయి. శ్రీలీల, మృణాల్‌ ఠాకూర్‌, మీనాక్షి చౌదరి వంటి కథానాయికలు దుమ్మురేపుతున్నారు. దీంతో రాశీకి తెలుగులో గడ్డు పరిస్థితి ఎదురవుతుందని టాక్‌. మరి దాన్ని ఎలా ఓవర్‌కమ్‌ చేస్తుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories