ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఇలా జంతువులతో!

First Published Aug 20, 2020, 11:40 AM IST

ఒక్క బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీపుల్ యాక్ట్రస్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ రాఖీ. చిన్న వయసులోనే రచయిత, నిర్మాత గుల్జర్‌ను పెళ్లాడిన ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒకప్పుడు స్టార్‌గా టాప్ ఇమేజ్‌ అందుకున్న రాఖీ ప్రస్తుతం ప్రపంచానికి దూరంగా జంతువులతో కలిసి కాలం వెళ్లదీస్తోంది.

ఒకప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్‌ యాక్ట్రస్‌గా పేరుతెచ్చుకున్న నటి రాఖీ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.
undefined
ఒకప్పుడు పొడవైన జుట్టుతో ఆకర్షనీయంగా కనిపించే రాఖీ, ఇప్పుడు పొట్టి హెయిర్‌ స్టైల్‌లో పూర్తిగా తన లుక్‌ను మార్చేసింది.
undefined
ముంబైకి దూరంగా తన ఫామ్‌ హౌజ్‌లో ఆవులు, గేదెలు, కుక్కలను పెంచుతూ కాలం గడుపుతోంది.
undefined
రాఖీ తన 16 ఏళ్ల వయసులో బెంగాళీ జర్నలిస్ట్‌ అజయ్‌ బిస్వాస్‌ను పెళ్లి చేసుకుంది. కానీ రెండేళ్లకే వారిద్దరు విడిపోయారు. తరువాత పదేళ్లకు బాలీవుడ్‌ ప్రముఖ రచయిత, నిర్మాత గుల్జర్‌ను పెళ్లాడింది రాఖీ, కానీ వారి వైవాహిక బంధం అంత సజావుగా సాగలేదు.
undefined
కొంత కాలం కలిసి జీవించిన తరువాత మనస్పర్థలతో వారిద్దరు విడిపోయారు. చాలా కాలంగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్న అధికారికంగా విడాకులు మాత్రం తీసుకోలేదు.
undefined
పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన రాఖీ, సడన్‌గా తన నిర్ణయం తప్పని భావించింది. తరువాత సినిమాలు చేయటం ప్రారంభించింది.
undefined
అయితే రాఖీ తిరిగి సినిమాల్లో నటించటం గుల్జర్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
undefined
ఒకసారి గుల్జర్‌ ఆనంది సినిమా కోసం కశ్మీర్‌లో లోకేషన్లు వెతికేందుకు వెళ్లారు. ఆయన వెంట రాఖీ కూడా వెళ్లింది. అయితే గుల్జర్‌ తన పనిలో బిజీగా ఉండగా, రాఖీ మాత్రం ఖాళీగా ఉండి బోర్‌ ఫీల్ అయ్యింది.
undefined
మరో సందర్భంలో సంజీవ్ కుమార్‌, సుచిత్రా సేన్‌లు నటించిన సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటూ పార్టీ చేసుకున్నారు. పార్టీలో సంజీవ్ కపూర్‌ తాగి సుచిత్రా దగ్గరకు రాగా, ఆమెను గుల్జర్‌ అక్కడి నుంచి తన కారులో తీసుకెళ్లి డ్రాప్‌ చేశాడు. అయితే గుల్జర్‌ కారులో సుచిత్రను తీసుకురావటం చూసిన రాఖీకి కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడలు ఎక్కువయ్యాయి.
undefined
అయితే ఈ గొడవలు జరుగుతున్న సందర్భంలో గుల్జర్‌, రాఖీని దారుణంగా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని బాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. కొద్ది రోజులకు రాఖీ యష్ చోప్రా నిర్మాణంలో కబీ కబీ సినిమాలకు అంగీకరించింది. గుల్జర్‌ ఆ నిర్ణయాన్ని వ్యతిరేఖించటంతో ఇద్దరు విడిపోయారు.
undefined
1970లో జీవన్‌ మృతి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాఖీ. తరువాత షర్మిలీ, లాల్‌ పత్తర్‌, పరాస్‌, లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది రాఖీ.
undefined
click me!