ధోనితో నా రిలేషన్ ఒక మచ్చలా మిగిలిపోయింది, భవిష్యత్తులో నా పిల్లలు ప్రశ్నిస్తే ఏంటి పరిస్థితి ?

tirumala AN | Published : May 10, 2025 1:34 PM
Google News Follow Us

ధోనీతో తమ సంబంధం గురించి రాయ్ లక్ష్మీ ఓపెన్‌గా మాట్లాడారు. అది మచ్చలా మిగిలిపోయిందని పేర్కొన్నారు.

 

15
ధోనితో నా రిలేషన్ ఒక మచ్చలా మిగిలిపోయింది, భవిష్యత్తులో నా పిల్లలు ప్రశ్నిస్తే ఏంటి పరిస్థితి ?
Raai Laxmi

సినీ నటిగా రాయ్ లక్ష్మీ దక్షిణాది భాషలైన తమిళం, మలయాళం, తెలుగు, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించి గుర్తింపు పొందింది. ఆమె 2005లో తమిళ చిత్రం 'కర్క కసదారా' ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు.తెలుగులో రాయ్ లక్ష్మి కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 

 

25

కేవలం సినిమాలకే కాకుండా, రాయ్ లక్ష్మీ అప్పట్లో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనితో ఉన్న సంబంధం గురించి వచ్చిన రూమర్స్ తోనూ వార్తల్లో నిలిచారు. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైన సమయంలో ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైనట్లు రూమర్స్ వచ్చాయి. పార్టీలు, జన్మదిన వేడుకల్లో కలిసి కనిపించిన వీరి రిలేషన్ గురించి అప్పట్లో గట్టిగానే చర్చ సాగింది.

 

35

అయితే, ఈ సంబంధాన్ని ధోనీ గానీ, రాయ్ లక్ష్మీ గానీ అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. కానీ, తరచూ పబ్లిక్‌గా కనిపించడం వలన వదంతులు మరింత పెరిగాయి.

 

45

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రాయ్ లక్ష్మి స్పందించారు. ఆమె మాట్లాడుతూ, “ధోనీతో నా సంబంధం ఒక మచ్చలా, గాయంలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ విషయాన్ని చర్చించడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో నా పిల్లలు ఇదే విషయాన్ని టీవీలో చూసి నన్ను అడిగితే నా పరిస్థితి ఏంటి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

55

ఆమె తదుపరి చెప్పిన వివరాలు ప్రకారం, వారు స్నేహపూర్వకంగా వేరుపడ్డారు. “ఇది నిజంగా సంబంధమా అని కూడా చెప్పలేను. ఎందుకంటే అది పూర్తిగా పని చేయలేదు. మేమిద్దరం ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. ఆయన పెళ్లి చేసుకుని ముందుకు వెళ్లిపోయారు. నేనూ ఇప్పుడు నా పని మీద దృష్టి పెట్టాను. ఎంతో ఆనందంగా ఉన్నాను.” అని చెప్పారు. ధోనీ 2010లో సాక్షి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. 2015లో జీవా అనే కుమార్తెకు తండ్రిగా మారారు. 

Read more Photos on
Recommended Photos