బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది. ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన రాయ్ లక్ష్మి 'రత్తాలు' అనే సాంగ్ లో చిందులేసింది. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుస్తున్నారు.