బ్యాంకాక్ లో కీర్తి సురేష్ సందడి.. ‘కళావతి’ కొత్త రికార్డు క్రియేట్ చేసిందే!

Published : Dec 27, 2022, 04:27 PM ISTUpdated : Dec 27, 2022, 04:28 PM IST

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం బ్యాంకాక్ లో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ బ్యూటీఫుల్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.   

PREV
16
బ్యాంకాక్ లో కీర్తి సురేష్ సందడి.. ‘కళావతి’ కొత్త రికార్డు క్రియేట్ చేసిందే!

‘మహానటి’ చిత్రంతో నటిగా జాతీయ స్థాయిలో అవార్డును  సొంతం చేసుకుంది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగు ఆడియెన్స్ లో ఈ హోమ్లీ బ్యూటీ స్పెషల్ ఇమేజ్ ఉంది. దీంతో తెలుగుతో పాటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో నటిస్తూ అలరిస్తూనే ఉందీ ముద్దుగుమ్మ. చివరిగా తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ మహిళా కథానాయికగా పరశురామ్ దర్శకత్వం వహించిన ‘సర్కారు వారి పాట’లో నటించిన విషయం తెలిసిందే. 
 

26

హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న కీర్తి ఈ చిత్రంతో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో తదుపరి చిత్రాలను కూడా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తోంది.  ఇక ఫ్రీ టైమ్ లో టూర్లు, వేకేషన్స్ కు వెళ్తూ సందడి చేస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో బ్యూటీఫుల్ పిక్ ను నెట్టింట వదిలింది. 

36

2022 క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇండియాలోని తన ఇంట్లో సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఆ వెంటనే కీర్తి సురేష్ బ్యాంకాక్ లోని థాయ్‌లాండ్‌కు బయలుదేరింది. క్రిస్మస్ హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు వేకేషన్ ను ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా వరుస ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
 

46

తాజాగా కీర్తీ సురేశ్ పంచుకున్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సముద్రపు గాలులకు రిలాక్స్ అవుతూ.. సంద్రపు అందాలను చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపిస్తోంది. ఓ చేతితో జ్యూస్ తాగుతూ ఫొటోకు ఫోజుచ్చిందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

56

ఇక ఈఏడాది ‘సర్కారు వారి పాట’లోని కళావతి (Kalaavathi) సాంగ్ కూడా కీర్తి సురేశ్ కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందే. రీసెంట్ గానే ఈ సాంగ్ తనకెంత ఇష్టమో తెలియజేసింది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్‌లో భాగంగా కళావతి మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 237 మిలియన్ల వ్యూస్ తో, 2.5 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించి సరికొత్త రికార్డును సృష్టించింది.
 

66

ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ కళావతి సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ స్వరాలు సమకూర్చారు. కీర్తి సురేశ్ కూడా బ్యూటీఫుల్ లుక్ లో అలరించారు. ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘దసరా’,‘భోళా శంకర్’.. తమిళంలో ‘మామ్నన్’,‘సైరెన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

click me!

Recommended Stories