`పుష్ప 2` పాట్నా ట్రైలర్‌ ఈవెంట్‌కి మహిళా పోలీసు భద్రత, ఎంత మంది పోలీస్‌ సెక్యూరిటీనో తెలిస్తే మైండ్‌ బ్లాకే

Published : Nov 17, 2024, 05:19 PM IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప 2` ట్రైలర్‌ ఈవెంట్‌ పాట్నా ఈ సాయంత్రం జరగబోతుంది. దీనికి ఎంత మంది పోలీసులు భద్రత నిర్వర్తిస్తున్నారో తెలిస్తే షాకే.   

PREV
114
`పుష్ప 2` పాట్నా ట్రైలర్‌ ఈవెంట్‌కి మహిళా పోలీసు భద్రత, ఎంత మంది పోలీస్‌ సెక్యూరిటీనో తెలిస్తే మైండ్‌ బ్లాకే
Allu Arjun, #Pushpa2, sukumar

అల్లు అర్జున్‌ మరోసారి పుష్పరాజ్‌గా రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన `పుష్ప 2` సినిమా డిసెంబర్‌ 5న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నేటి నుంచి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు టీమ్‌. వరుసగా భారీ ఈవెంట్లు ప్లాన్‌ చేశారు. నేడు పాట్నాలో ట్రైలర్‌ ఈవెంట్‌ని నిర్వర్తిస్తున్నారు. 

214

పాట్నాలోని గాంధీ మైదానం అందుకు వేదిక అయ్యింది. అక్కడ భారీ స్థాయిలో ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

314

ఇప్పటికే వందల మంది ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు పాట్నాకి చేరుకున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు స్థానికంగా ఉండే ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నారట. 
 

414

అందుకోసం ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. అంతేకాదు సెక్యూరిటీ కూడా అంతకు మించి అనేలా ఉంది. అయితే ఆ స్టేట్‌ లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కి భారీగా పోలీసులతో బందోబస్తు నిర్వర్తించడం విశేషం. 
 

514

బీహార్‌ ప్రభుత్వం ఏకంగా 1200 మంది పోలీస్‌ సెక్యూరిటీని కేటాయించింది. ఇందులో 900 మంది పోలీసులు ఉండగా, 300 మందిప్రైవేట్‌ సెక్యూరిటీ కేటాయించడం విశేషం.

614

ఇలా ఇంతటి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. దీంతో ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రైవేట్‌ ఈవెంట్‌గా మారిపోయింది. 

714

ఈ మైదానంలోని `పుష్ప2` ట్రైలర్‌ ఈవెంట్‌ ఫోటోలను టీమ్‌ పంచుకుంది. ఆ ఏర్పాట్లు కనువిందు చేస్తున్నాయి. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈవెంట్‌ వేదికగా, అల్లు అర్జున్‌, సుకుమార్‌ కటౌట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. 
 

814

అలాగే తెల్లని చైర్స్ తో వీఐపీ సెక్షన్‌కి భారీగా సీట్లు ఏర్పాటు చేయడం. లక్ష మందికిపైగా పాల్గొనేలా గ్రౌండ్‌ని ప్రిపేర్‌ చేశారు. దానికి తగ్గట్టుగానే భారీగా పోలీసు బందోబస్తు నిర్వర్తిస్తున్నారు. 
 

914

అల్లు అర్జున్ ఇప్పటికే పాట్నాకి చేరుకున్నాయి. ఆయన హోటల్‌కి వెళ్లి, ఫ్రెషప్‌ అయి అట్నుంచి ఈవెంట్‌కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. 7గంటల నుంచి ఈ ఈవెంట్‌ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. 

1014

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప 2` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 
 

1114

ఇక `పుష్ప2` సినిమాకి సంబంధించి ప్రమోషనల్‌ ఈవెంట్లు భారీగా ప్లాన్‌ చేశారు. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరు, కొచ్చిలో ప్లాన్‌ చేశారు. వరుసగా ఈవెంట్లు నిర్వహించబోతున్నారు. 
 

1214

`పుష్ప 2` సినిమా పాట్నాలో జరగబోతున్న ట్రైలర్‌ ఈవెంట్ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

1314

`పుష్ప 2` సినిమా పాట్నాలో జరగబోతున్న ట్రైలర్‌ ఈవెంట్ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories