Firstday Collections-Roundup 2021: పవన్‌ని కొట్టలేకపోయిన బన్నీ.. బాలయ్య, రవితేజ ఈ ఏడాది ఎవరి లెక్క ఎంత ?

First Published Dec 18, 2021, 5:09 PM IST

మారిన కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏ సినిమాకైనా ఫస్ట్ డే కలెక్షన్లు ఇంపార్టెంట్‌గా మారాయి. మరి 2021లో థియేటర్లలో విడుదలైన సినిమాలో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సినిమాలేంటో చూద్దాం. విడుదలైన వాటిలో ప్రధానంగా `పుష్ప`, `అఖండ`, `లవ్‌ స్టోరీ`, `వకీల్‌సాబ్‌`, `ఉప్పెన`, `క్రాక్‌` చిత్రాల గురించి చూస్తే ..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన `పుష్ప` చిత్రం మరోసారి థియేటర్లని నింపింది. ఈ చిత్రం `అఖండ` తర్వాత మరో లెవల్‌లో థియేటర్లు ఫుల్‌ అయ్యాయి. `అల వైకుంఠపురములో` తర్వాత అల్లు అర్జున్‌ నుంచి వచ్చిన సినిమా కావడం, `రంగస్థలం` తర్వాత సుకుమార్‌ నుంచి వచ్చిన సినిమా కావడంతో `పుష్ప`పై భారీ అంచనాలున్నాయి. అనేక అంచనాల నడుమ శుక్రవారం(డిసెంబర్‌ 17న) విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంటోంది. ఈ రెండు రోజుల్లో అసలైన రిజల్ట్ ఏంటనేది తేలనుంది. కానీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది `పుష్ప`. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. 

పాన్‌ ఇండియా లెవల్‌లో `పుష్ప` విడుదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది. కేరళాలలో సాయంత్రం షోస్‌ పడ్డాయి. మార్నింగ్‌ షోస్‌కి కాపీ అందకపోవడంతో పగలు షోస్‌ పడలేదు. ఏపీలో చాలా చోట్ల బెనిఫిట్‌ షోలు పడకపోవడం, టికెట్ల రేట్ల సమస్య నెలకొన్న నేపథ్యంలో అనేక అడ్డంకులున్నప్పటికీ `పుష్ప` తన సత్తాని చాటింది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.39కోట్లు(38.50) వసూలు చేసింది. ఇంతటి ప్రతికూల సమయంలోనే సినిమాకి ఈ స్థాయిలో ఆదరణ దక్కడం విశేషంగా చెప్పొచ్చు. 
 

సినిమా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. నైజాం, ఆంధ్రాలో 1150థియేటర్లలో, కర్నాటక, తమిళనాడు, కేరళ, హిందీలో 1200 థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్‌లో 600థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. నైజాంలో ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.11.44కోట్లు వసూలు చేయడం విశేషం. సీడెడ్‌ 4.20కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.8కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.1.43కోట్లు, వెస్ట్ గోదావరి రూ.1.5కోట్లు, గుంటూరు రూ.2.28కోట్లు, కృష్ణా రూ.1.15కోట్లు, నెల్లూరు రూ.1.10కోట్లు, ఓవర్సీస్‌లో 4.25కోట్లు రాబట్టింది. ముందుగానే బుకింగ్ కావడం వల్ల ఈ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయని, లేకపోతే మామూలుకలెక్షన్లే వచ్చేవంటున్నారు. 

ఇదిలా ఉంటే సినిమాకి అభిమానుల నుంచి, సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బన్నీ నటన, సుకుమార్‌ టేకింగ్‌, సరికొత్తగా సినిమాని తీసిన విధానం, వారు పడ్డ కష్టంపైఅంతా మాట్లాడుతున్నారు.  అదే సమయంలో ల్యాగ్‌, మూడు గంటల నిడివి, ఆర్‌ఆర్‌ ఎలివేషన్‌ కరెక్ట్ గా సెట్‌ కాలేదనే టాక్‌ వినిపిస్తుంది. సినిమాపై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే `పుష్ప` మరో లెవల్‌లో ఉండేదని, నిజంగానే తగ్గేదెలే అనిపించేదనే అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. `ఆర్య`, `ఆర్య2` తర్వాత బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. సునీల్‌, అనసూయ, రావు రమేష్‌, శత్రు కీలక పాత్రలు పోషించారు. ఫహద్‌ ఫాజిల్‌ క్లైమాక్స్ లో ఇచ్చారు. ఎర్రచందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా నటించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే ఫస్ట్ డే కలెక్షన్లలో `పుష్ప`.. పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌`ని కొట్టలేకపోయారనే టాక్‌ వినిపిస్తుంది. `పింక్‌` రీమేక్‌గా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో వచ్చిన `వకీల్‌సాబ్‌` చిత్రం సెకండ్‌ వేవ్‌ కరోనాకి ముందు ఏప్రిల్‌ 9న విడుదలైంది. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు సుమారు 50కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల టాక్. ఈ లెక్కన పవన్‌ని బన్నీ దాటలేకపోయారనే టాక్‌ వినిపిస్తుంది. 

ఇక ఫస్ట్ డే కలెక్షన్లలో బాలయ్య నటించిన `అఖండ` తన సత్తాని చాటింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లని నింపిన చిత్రమిదే అని చెప్పొచ్చు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ.30కోట్ల గ్రాస్‌(23షేర్‌)వసూలు చేసింది.ఈ సినిమా మొత్తంగా వంద కోట్లని అధిగమించింది ఇప్పటికే చాలా చోట్ల హౌజ్‌ఫుల్‌ తో రన్‌ అవుతుంది. ఈ చిత్రం ఈ డిసెంబర్‌ 2న విడుదలైన విషయం తెలిసిందే. 

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన శేఖర్‌ కమ్ముల సినిమా `లవ్‌ స్టోరీ` కూడా బాగానే వసూలు చేసింది.ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ. పదకొండు కోట్లు రాబట్టింది. లవ్‌ స్టోరీ ప్రధానంగా సాగే ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. 

మరోవైపు ఈ ఏడాది రౌండప్‌లో భాగంగా 2021లో ఫస్ట్ డే కలెక్షన్లు బాగా రాబట్టిన చిత్రాల్లో `ఉప్పెన` కూడా ఉంది. ఈ చిత్రానికి తొలి రోజు 11 కోట్లు వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాల సమాచారం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, నూతన హీరోయిన్‌ కృతి శెట్టి కథానాయికగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు సానా తాను దర్శకుడిగా పరిచయం అవుతూ `ఉప్పెన`ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా వంద కోట్లు వసూలు చేయడం విశేషం. ఇదొక సంచలనాత్మక చిత్రంగా నిలిచింది. 
 

ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో రవితేజ నటించిన `క్రాక్‌` సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కరోనా సమయంలోనే విడుదలై ఇది దాదాపు తొమ్మిది కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రం ఓవరాల్‌గా అరవై కోట్లకు పైనే కలెక్ట్ చేసినట్టు టాక్‌. 

also read: Pushpa: ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్‌ ,ఆంధ్రాలో దెబ్బే
 

click me!