‘పుష్ఫ’ క్రేజ్ తగ్గదంటే తగ్గదంతే.. మార్కెట్ లోకి తాజాగా పుష్ప షర్ట్స్.. పార్ట్ 2 షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..

Published : Jun 05, 2022, 02:15 PM ISTUpdated : Jun 05, 2022, 02:32 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుష్ప : ది రైజ్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఓ అభిమాని తాజాగా పుష్ఫ షర్ట్స్ ధరించడంతో ఎప్పటికీ ఆ క్రేజ్ తగ్గదని అర్థమవుతోంది.  

PREV
16
‘పుష్ఫ’ క్రేజ్ తగ్గదంటే తగ్గదంతే.. మార్కెట్ లోకి తాజాగా పుష్ప షర్ట్స్.. పార్ట్ 2 షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే అరుదైన కలప ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ నేపథ్యంలో  తెరకెక్కిన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ (Pushpa: The Rise). ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన నట విశ్వరూపం చూపించారు. 
 

26

 పక్కా మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు బన్నీ.  ఊరమాస్ లుక్ లో అల్లు అర్జున్ సౌత్ తో పాటు.. అటు నార్త్ లోనూ ఆడియెన్స్ ను  ఆకట్టుకుంటున్నాడు. అల్లు అర్జున్ మేనరిజం, యాస, ఆహార్యంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రీచ్ కాగలిగింది. 

36

 ఇప్పటికే ఈ చిత్రంలోని ‘ఊ అంటవా.. మామా’ మరియు ‘శ్రీవల్లి’ సాంగ్స్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పుష్ప : ది రైజ్ సాంగ్స్ య్యూటూబ్ లో 2 బిలియన్ వ్యూస్ ను దక్కించుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికీ పుష్ప సాంగ్స్ మోతమోగుతూనే ఉన్నాయి. 

46

 ‘పుష్ప’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. బన్నీ మేనరిజం, ‘తగ్గెదే లే’ మరియు ‘పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా’ అనే వన్ లైన్ డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఏకంగా పాపులర్ క్రికేటర్స్, పొలిటిషియన్స్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా కూడా పుష్ఫ మేనియాను ఫాలోకావడంతో ఈ సినిమా అంతర్జాతీయంగా ఎక్కువగా రీచ్ అయ్యింది. ఈ కారణంగా సినిమాను ఇండియన్ ఐకానిక్ ఫిల్మ్ గా గుర్తించారు. 

56

మొదటి పార్ట్ రిలీజ్ అయి ఆరు నెలలు గడిచినా.. ఇప్పటికీ పుష్ఫ క్రేజ్ తగ్గలేదని మరోసారి అభిమానులు రుజువు చేశారు. తాజాగా మార్కెట్ లోకి వచ్చిన పుష్ప షర్ట్స్ ను ధరించి సినిమాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. షర్ట్స్ పై అల్లు  అర్జున్,  రష్మిక మందన్న ఫొటోలు ప్రింట్ చేసి ఉండటం విశేషం. అలాగే ఆటోలపైనా సరికొత్తగా పుష్ప రాజ్ స్టిక్కర్లను అంటించుకొని పుష్ఫ క్రేజ్ తగ్గదంటే తగ్గదంతేనని రుజువు చేస్తున్నారు. 

66

 ప్రస్తుతం అభిమానులు, ప్రేక్షకులు ‘పుష్ఫ : ది రూల్’ (Pushpa : The Rule) కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదరుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పార్ట్ 2 షూటింగ్ జూలై మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేషన్స్, కాస్ట్స్ డేట్స్ అన్ని సిద్ధం చేసిందట చిత్ర యూనిట్. సినిమాను 2023లో రిలీజ్ చేయనున్నారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories