Vikram Collections: బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమల్... విక్రమ్ మూవీ ప్రభంజనం రెండు రోజుల్లో రూ. 100 కోట్లు!

Published : Jun 05, 2022, 02:14 PM IST

చాలా కాలం తర్వాత కమల్ హాసన్ తన బాక్సాఫీస్ స్టామినా చూపించాడు. రెండు రోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టి సత్తా చాటాడు. విక్రమ్ మూవీ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తున్నాయి.   

PREV
16
Vikram Collections: బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమల్... విక్రమ్ మూవీ ప్రభంజనం రెండు రోజుల్లో రూ. 100 కోట్లు!


జూన్ 3న విడుదలైన విక్రమ్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. సినిమాకు ట్రెమండస్ టాక్ వచ్చిన నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీలో విక్రమ్ సాలిడ్ వసూళ్లు సాధిస్తుంది. వీకెండ్ ముగియకుండానే విక్రమ్ (Vikram collections) వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల గ్రాస్ దాటేసింది. 
 

26

మూవీ కలెక్షన్స్ లో పురోగతి కనిపిస్తుండగా... ఆదివారం విక్రమ్ వసూళ్లు భారీగా ఉండే సూచనలు కలవు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. కమల్ హాసన్ (Kamal Haasan) ని రెండు దశాబ్దాల తర్వాత సూపర్ యాక్షన్ హీరోగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఎక్కడా నెమ్మదించకుండా పరుగులు పెట్టే స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని థ్రిల్ కి గురిచేసింది. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నటనలో కమల్ తో పోటీపడ్డారు

36


అనిరుధ్ బీజీఎం, క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ గూస్ బంప్స్ కలిగించాయి. ఓ సాలిడ్ ఎంటర్టైనర్ కి అదే స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. ఫస్ట్ డే విక్రమ్ రూ. 58 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది.  తమిళనాడులో రూ. 23.5 కోట్ల ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన విక్రమ్ కేరళలో దుమ్ము దులిపింది. రూ. 5.02 కోట్లతో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఇక కర్ణాటక రూ. 4.25 కోట్లు, ఏపీ రూ. 3.75 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ అందుకుంది. 

46


రెండవ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ వంద కోట్లను దాటేసింది. ఓవర్సీస్ లో కూడా విక్రమ్ వసూళ్ల వరద పారిస్తుంది. లేటెస్ట్ సమాచారం మేరకు విక్రమ్ యూఎస్ కలెక్షన్స్ $1.4 మిలియన్ డాలర్స్ గా ఉన్నాయి. ట్రెండ్ చూస్తే రన్ ముగిసే నాటికి $3 మిలియన్ సాధ్యమే అంటున్నారు. 

56


ఇక ఓవరాల్ గా విక్రమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వంద కోట్ల లోపే జరిగింది. తమిళనాడు రూ. 51 కోట్లు, ఏపీ రూ. 8 కోట్లు, కర్ణాటక రూ.5.5 కోట్లు, కేరళ రూ.4.5 కోట్లు, హిందీ రూ.2 కోట్లు,  ఓవర్సీస్ రూ. 16 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 90.5 కోట్ల బిజినెస్ జరిగింది. 

66

విక్రమ్ వసూళ్లు చూస్తుంటే వీకెండ్ ముగిసే నాటికి బ్రేక్ ఈవెన్ చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ విడుదల చేశారు. ఏపీ/తెలంగాణాలో విక్రమ్ కి పూర్తి స్థాయిలో థియేటర్స్ దొరకేలేదు. లేదంటే కలెక్షన్స్ ఇంకా మెరుగ్గా ఉండేవి. విక్రమ్ మూవీ నితిన్ కి లాభాలు పంచేలా కనిపిస్తుంది.

click me!

Recommended Stories