అరుదైన వ్యాధి బారిన పడిన పుష్ప విలన్... ఏమిటీ ADHD? లక్షణాలు ఎలా ఉంటాయంటే?

Published : May 28, 2024, 03:01 PM IST

పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డారన్న న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఫహాద్ ఫాజిల్ వెల్లడించిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.   

PREV
16
అరుదైన వ్యాధి బారిన పడిన పుష్ప విలన్... ఏమిటీ ADHD? లక్షణాలు ఎలా ఉంటాయంటే?
Fahaad Faasil

ఫహాద్ ఫాజిల్ మలయాళ పరిశ్రమ స్టార్ హీరోలలో ఒకరు. విలక్షణమైన చిత్రాలతో అద్భుతమైన విజయాలు అందించారు. ఆయన లేటెస్ట్ మూవీ ఆవేశం. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ లాభాలు పంచింది. 
 

26

ఇక పుష్ప విలన్ గా తెలుగు ప్రేక్షకులకు కూడా ఫహాద్ ఫాజిల్ బాగా పరిచయం. 2021లో విడుదలైన పుష్ప బ్లాక్ బస్టర్ కాగా... పతాక సన్నివేశాల్లో ఫహాద్ ఫాజిల్ నటన హైలెట్ అని చెప్పాలి. ఆయన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా పుష్ప 2పై ఆయన పాత్ర ఆసక్తిని పెంచేసింది. 

 

36

నెక్స్ట్ ఆయన పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ గా పూర్తి స్థాయి రోల్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ - ఫహద్ ఫాజిల్ మధ్య సంఘర్షణే పుష్ప 2కి హైలెట్ అని సమాచారం. పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

46


సిల్వర్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా కనిపించే ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఫహాద్ ఫాజిల్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఫహాద్ ఫాజిల్ చిల్డ్రన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్లారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తనకున్న వ్యాధిని బయటపెట్టారు. 

56
Fahadh Faasil

41 ఏళ్ల వయసు నుండి తాను ADHD అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఇదో మానసిక వ్యాధి కాగా... సోకిన వారికి ఏ విషయం మీద ఏకాగ్రత ఉండదట. ధ్యాస ఉండదట. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటి లక్షణాలతో బాధపడతారట. ADHD అనగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజాస్టర్ అట. ఈ వ్యాధికి ఫహాద్ చికిత్స తీసుకుంటున్నాడట. 

 

66
fahad nazria

ఫహద్ కామెంట్స్ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. 2022లో విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఆమె నటించిన ఏకైక తెలుగు చిత్రం అంటే సుందరానికీ. 

Read more Photos on
click me!

Recommended Stories