ఎన్టీఆర్ పిల్లలకు ప్రత్యేకమైన పేర్లు, దీని వెనుక ఉన్న కథేంటి? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Published : May 28, 2024, 10:55 AM IST

నందమూరి తారక రామారావుకు 12 మంది సంతానం. 8 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు. వీరికి ఎన్టీఆర్ ప్రత్యేకంగా పేర్లు పెట్టాడు. దాని వెనుక పెద్ద వ్యవహారమే ఉంది.   

PREV
15
ఎన్టీఆర్ పిల్లలకు ప్రత్యేకమైన పేర్లు, దీని వెనుక ఉన్న కథేంటి? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

లెజెండ్ ఎన్టీఆర్ జయంతి నేడు. 1923 మే 28న ఆయన జన్మించారు. వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలిగిన ఎన్టీఆర్... తెలుగు సినిమా కీర్తిని ఇనుమడింప చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశాడు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టాడు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ ప్రతి విషయంలో ప్రత్యేకత చాటుకున్నారు. 
 

25
NTR birth anniversary

ఎన్టీఆర్ సమాజంతో పాటు కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమించారు. ఎన్టీఆర్ కి 12 మంది సంతానం. వారికి మంచి చదువులు చెప్పించారు. కళలు నేర్పించారు. బాలకృష్ణ, హరికృష్ణ నటులుగా రాణించారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతలుగా ఒకరిద్దరు సత్తా చాటారు. ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసింది. 
 

35

కాగా ఎన్టీఆర్ పిల్లల పేర్లను చాలా ప్రత్యేకంగా పెట్టారు. అబ్బాయిల పేర్లు చివర కృష్ణ వచ్చేలా, అమ్మాయిల పేర్ల చివర ఈశ్వరి వచ్చేలా ఎన్టీఆర్ పేర్లు నిర్ణయించారు. రామకృష్ణ, సీనియర్ జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహన కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్ జయకృష్ణ... ఎన్టీఆర్ కుమారులు. వీరందరి పేర్ల చివరి కృష్ణ ఉండటం మనం చూడొచ్చు. 

45

ఇక అమ్మాయిల పేర్లు పరిశీలిస్తే... పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, ఉమామహేశ్వరి గా ఎన్టీఆర్ నిర్ణయించారు. ప్రతి పేరు చివర ఈశ్వరి వచ్చేలా ఆయన పేర్లు నిర్ణయించాడు. ఎన్టీఆర్ తన కూతుళ్లు, కొడుకుల పేర్ల విషయంలో ఒక ప్రాస ఫాలో అయ్యారు. 

 

55

ఎన్టీఆర్ కి దైవభక్తి ఎక్కువ. అందుకే లార్డ్ కృష్ణ పేరు కొడుకులకు పెట్టాడు. అలాగే శివుడి మరొక పేరు ఈశ్వరుడు లోని ఈశ్వరి అమ్మాయిల పేర్లలో చివరి వచ్చేలా చూసుకున్నాడు. అలాగే భాషాభిమానం కలిగిన ఆయన పిల్లల పేర్లలో తెలుగుదనం ఉట్టిపడేలా నిర్ణయించారు. దైవభక్తి, భాషాభిమానం వెరసి ఎన్టీఆర్ తన పిల్లల పేర్లను ప్రత్యేకంగా పెట్టారు. 

click me!

Recommended Stories