ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రం కోసం అభిమానులు మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ చేసిన మ్యాజిక్ అలాంటిది. డైరెక్టర్ సుకుమార్ అయితే పుష్ప మొదటి భాగానికి పదింతలు పవర్ ఫుల్ గా ఉండేలా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ అంతా అనుకున్నట్లుగా సాఫీగా జరుగుతున్న సమయంలో ఊహించని సెట్ బ్యాక్ ఎదురైంది.