మీ వయసు తక్కువే, రెండో పెళ్లి గురించి మీనాని విసిగించిన యాంకర్.. వెకిలి ప్రశ్నలకు ఘాటుగా సమాధానం

First Published Jan 4, 2024, 10:44 AM IST

మీనా 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందం అభినయంతో సౌత్ లో మీనా చెరగని ముద్ర వేసింది. 

meena

మీనా 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందం అభినయంతో సౌత్ లో మీనా చెరగని ముద్ర వేసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్, వెంకటేష్ ఇలా సౌత్ స్టార్ హీరోలందరి సరసన మీనా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

అయితే 2022లో మీనా వ్యక్తిగత జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్య, కోవిడ్ కారణంగా మరణించారు. ఈ సంఘటన మీనాకి తీరని వేదనని మిగిల్చింది. ఇప్పుడిప్పుడే మీనా కోలుకుంటోంది. తన కుమార్తెకి ఏ లోటూ రాకుండా చోసుకోవడమే ఇక ఆమె భాద్యత అట.   

Latest Videos


2009లో మీనా బెంగుళూరుకి చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నైనిక అనే ముద్దుల కుమార్తె జన్మించింది. నైనిక కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. విజయ్ తేరి చిత్రంలో అతడి కుమార్తె గా ముద్దు ముద్దుగా నైనిక అద్భుతంగా నటించింది. 

ప్రస్తుతం మీనా వయసు 47 ఏళ్ళు. ఆమె భర్త మరణించాక తరచుగా రెండో పెళ్లి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే మీనా తాను రెండో పెళ్లికి చేఉకోబోతున్నట్లు ఎక్కడా చెప్పలేదు. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాకి యాంకర్ నుంచి వెకిలి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ యాంకర్ ఎలాగైనా మీనా నుంచి రెండవ పెళ్ళికి సంబందించిన సమాధానం రాబట్టాలనే ఉద్దేశంతో వెకిలిగా మితిమీరి ప్రశ్నలు అడిగాడు. 

కానీ మీనా మాత్రం సహనం కోల్పోకుండా సూటిగా సమాధానం ఇచ్చింది. సదరు యాంకర్ ప్రశ్నిస్తూ.. మీరు అందంగా ఉన్నారు.. వయసు కూడా తక్కువే రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ఒకే ప్రశ్నని పలు రకాలుగా అడిగాడు. రెండో పెళ్లికి గురించే మాట్లాడుతూ మీనాని విసిగించాడు. మీనా మాత్రం.. రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇప్పటికైతే లేదు. భవిష్యతులో ఏంజరుగుతుందో నాకు తెలియదు. 

ఎందుకంటే నా జీవితంలో నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ఇంత పెద్ద నటిని అవుతానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నా మొదటి ప్రాధాన్యత నా కూతురు మాత్రమే. కూతురు కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఒంటరిగా సింగిల్ మదర్ గా ఉండడం కష్టం ఏమీ కాదు. అలాగని నేను ఒంటరిగా ఉండిపోతానా అంటే అది కూడా నాకు తెలియదు. నా కంఫర్ట్ మాత్రమే నేను చూసుకోను. 

పెళ్లి చేసుకుంటా.. ఆ టైం లో చేసుకుంటా, ఏడాది తర్వాత చేసుకుంటా.. పెళ్లి చేసుకోను.. ఒంటరిగా ఉంటాను ఇలాంటి స్టేట్మెంట్ నేను ఇవ్వను. ఎందుకంటే రేపు ఏమైనా జరగొచ్చు అని మీనా సమాధానం ఇచ్చింది. 

click me!