Dhananjay Wedding: పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లో జాలి రెడ్డి పాత్రలో నటించిన నటుడు ధనంజయ్ 38 ఏళ్ళ వయసులో ఓ ఇంటివాడు అయ్యారు. ధనంజయ్ వివాహం ధన్యత అనే అమ్మాయితో ఘనంగా జరిగింది.
Dhananjay Wedding: పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లో జాలి రెడ్డి పాత్రలో నటించిన నటుడు ధనంజయ్ 38 ఏళ్ళ వయసులో ఓ ఇంటివాడు అయ్యారు. ఫ్యాన్స్ అతడిని దాళి అని పిలుస్తుంటారు. ధనంజయ్ వివాహం ధన్యత అనే అమ్మాయితో ఘనంగా జరిగింది.
29
Dhananjay
ధనుంజయ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, బంధువులు, సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ధనంజయ్ పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోలు చూడ ముచ్చటగా ఉన్నాయి. వధూవరులు సాంప్రదాయ వస్త్రధారణలో ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
39
Dhananjay
పెళ్లి కూతురు ధన్యత అయితే తాను ఇష్టపడిన వ్యక్తిని తన వాడిని చేసుకోబోతుండడంతో పట్టలేని సంతోషంలో ఉంది. తాళి కడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ధన్యత, ధనంజయ్ ఇద్దరూ ప్రేమతో ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించుకున్నారు.
49
Dhananjay
పుష్ప చిత్రంలో ధనంజయ్ కొండారెడ్డి తమ్ముడిగా నటించారు. అయితే పుష్ప 2లో అతడి పాత్రకి అంతగా ప్రాధాన్యత దక్కలేదు. పుష్ప 3 కూడా అనౌన్స్ చేసారు కాబట్టి అందులో ఏమైనా ధనంజయ్ కి ప్రాధాన్యత ఉంటుందేమో చూడాలి.
59
Dhananjay
ధనంజయ్, గైనకాలజిస్ట్ ధన్యతని పెళ్లి చేసుకుంటున్నారు. ధన్యత చాలా సింపుల్, అర్థం చేసుకునే వ్యక్తి అని ధనంజయ్ అభివర్ణించారు. గత రెండు నెలలుగా, ధన్యత, ధనంజయ్ తెలుగు సినిమాలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో సహా చిత్ర, రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాలు పంపారు.
69
Dhananjay
ధనంజయ్, ధన్యత హీరో, అభిమానిగా కలుసుకున్నారు. ధన్యత విద్యార్థిగా ఉన్నప్పుడు అభిమాని. తరువాత వారు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు, ఇప్పుడు వారి సంబంధం పెళ్లితో ముగిసింది.
79
Dhananjay
అతని గ్రామం కలెనహళ్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కొత్త టైల్స్, వాల్ పెయింట్, నీటి వ్యవస్థ, పగుళ్లు బారిన పడిన గోడలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు.ధనుంజయ్ ఇలాంటి చారిటి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.
89
Dhananjay
ధన్యత ధనంజయ్ తల్లికి పసుపు రాసింది. దాళి తల్లి తన కొడుకు పెళ్లి చూడాలని చాలా కాలంగా కోరుకుంది, ఆమె కోరిక ఇప్పుడు నెరవేరింది. ధనంజయ్ 2013లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
99
Dhananjay
ధనంజయ్ కి ప్రస్తుతం సౌత్ మొత్తం అవకాశాలు వస్తున్నాయి. దాళి ధనంజయ్ చిత్రాలలో నటించిన సప్తమి గౌడ, ధనంజయ్ హల్దీ వేడుకకు హాజరై, ధనంజయ్, ధన్యతల ఆనందంలో పాలుపంచుకున్నారు. ధనంజయ్ తెలుగులో పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో జాలి రెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా సత్యదేవ్ తో కలసి జీబ్రా మూవీలో కూడా నటించారు.