పుష్ప 2 టికెట్ రేట్లపై హైకోర్టులో పిటిషన్

Published : Dec 03, 2024, 06:24 AM IST

‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ధరలు పెంపుపై కోర్టు కల్పించుకోవాలని పిటిషనర్ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చాయి.

PREV
15
పుష్ప 2 టికెట్ రేట్లపై హైకోర్టులో పిటిషన్
Pushpa 2, Telangana High Court, allu arjun, ticket rates


అల్లు అర్జున్ తాజా చిత్రం   ‘పుష్ప2’ టికెట్‌ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేసాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

‘పుష్ప2’ ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో విడుదలకానుంది. ‘‘అత్యధిక థియేటర్లలో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్‌ యాప్‌ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం ఉంది’’ అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో తెలంగాణా లో పెంచిన టిక్కెట్ల రేట్లపై కోర్టులో కేసు నమోదు అయ్యింది.

25
Pushpa 2, allu arjun, sukumar, OTT Release

 తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు (pushpa 2 ticket price) పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచింది.

ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది.

35
allu arjun movie Pushpa 2 The Rule


అలాగే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 

45
pushpa 2


అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా  టిక్కెట్ రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా ధరలు పెంపుపై కోర్టు కల్పించుకోవాలని.. సామాన్యుడికి అందుబాటులోకి వినోదం తీసుకురావాలని పిటిషనర్‌ తన ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ రోజు (మంగళవారం) విచారణ చేపట్టనున్నట్లు  సమాచారం. ఈ పిటిషన్‌ దాఖలవడంతో పుష్ప 2 ది రూల్‌ చిత్ర టీమ్ షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది.

55
allu arjun movie Pushpa 2 The Rule


మరో ప్రక్క ఆంధ్ర ప్రదేశ్ లోనూ టిక్కెట్ రేట్లు పెంపుపై జీవో ఇచ్చారు. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు (జీఎస్టీ అదనం). ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే రూ.800+GST చెల్లించాల్సిందే. (Pushpa2 Ticket Rates)
 

Read more Photos on
click me!

Recommended Stories