బిగ్ బాస్ 9లో పుష్ప 2 పీలింగ్స్ సింగర్ కి ఛాన్స్ ? ఆమె రియాక్షన్ ఇదే.. భర్త, కొడుకు గురించి ఎమోషనల్ గా..

Published : Jul 13, 2025, 09:53 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లుగా బిగ్ బాస్ షో ఒకే తరహాలో సాగింది.

PREV
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లుగా బిగ్ బాస్ షో ఒకే తరహాలో సాగింది. ఒకే రకమైన టాస్కులు, ఒకే రకమైన గేమ్స్, ఒకే విధంగా సాగే గొడవలతో బిగ్ బాస్ షో బోరింగ్ గా మారుతోంది అంటూ కొందరు ప్రేక్షకులు నుంచి విమర్శలు వస్తున్నాయి.

25

దీంతో సీజన్ 9లో సమూలంగా మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 9 కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. సీజన్ 9 లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

35

జబర్దస్త్ వర్ష, ఇమ్మానుయేల్, రీతు చౌదరి ఇలాంటి బుల్లితెర సెలబ్రిటీలు బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అదే విధంగా తేజస్విని గౌడ, కల్పిక గణేష్, నవ్య స్వామి, జ్యోతి రాయ్ లాంటి వారు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. కేవలం షోని అనౌన్స్ చేస్తూ ప్రోమో మాత్రమే విడుదల చేశారు. 

45

ఇదిలా ఉండగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ లక్ష్మీ దాస కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. లక్ష్మీ దాస ఎవరో కాదు.. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో సూపర్ హిట్ అయిన పీలింగ్స్ సాంగ్ ని ఆమె పాడారు. జానపద గాయని అయిన లక్ష్మీ దాస యూట్యూబ్ లో పాపులర్ అయ్యారు. అనేక జానపద గీతాలను అద్భుతంగా ఆలపించిన ఆమె ఇప్పుడు నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు.

55

దసరా చిత్రంలో ధూమ్ ధామ్ దోస్తాన్ అనే సాంగ్ ని కూడా లక్ష్మీ పాడారు. అయితే తాను బిగ్ బాస్ 9 లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై లక్ష్మీ దాస తాజాగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె తెలిపారు. బిగ్ బాస్ షోకి వెళుతున్నారా అనే ప్రశ్నకు లక్ష్మీ దాస స్పందిస్తూ.. అసలు తనకి బిగ్ బాస్ షోకి వెళ్లాలనే ఆలోచన రాలేదని తెలిపారు. నాకు ఏడాదిన్నర కొడుకు, భర్త ఉన్నారు. వాళ్లే నా ప్రపంచం. వాళ్లని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను.

దుబాయ్, మస్కట్ లాంటి దేశాల్లో తనకి ప్రోగ్రామ్స్ వస్తున్నప్పటికీ ఫ్యామిలీ కోసం వెళ్లలేకపోతున్నానని లక్ష్మీ దాస తెలిపారు. అలాంటిది బిగ్ బాస్ షోకి ఎలా వెళతాను అని ప్రశ్నించారు. కానీ తాను బిగ్ బాస్ షోని రెగ్యులర్ గా చూస్తుంటానని తెలిపారు. ఒకవేళ బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories