మొత్తం స్క్రిప్టెడ్, అర్జున్ కళ్యాణ్ కి అందుకే ముద్దు పెట్టా.. బిగ్ బాస్ వాసంతి బయటపెట్టేసిందిగా

Published : Jul 13, 2025, 07:44 PM IST

బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీల గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

PREV
15

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీజన్ 9కి ప్రస్తుతం సన్నాహకాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ వర్క్ పూర్తి చేస్తున్నారు. అదే విధంగా కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. 

25

బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీల గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ లో అర్జున్ కళ్యాణ్, వాసంతి కూడా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో అర్జున్ కళ్యాణ్, వాసంతి, శ్రీ సత్య మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. 

35

అర్జున్ కళ్యాణ్ కోసమే వాసంతి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ దానిని ఆమె ఖండించింది. ఎవరికోసమో ఎవరో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లరు. మన సొంత పాపులారిటీ, కెరీర్ కోసమే బిగ్ బాస్ లోకి వెళతాం అని వాసంతి పేర్కొంది. 

45

గతంలో శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో అర్జున్ కళ్యాణ్, వాసంతి పాల్గొన్నారు. ఈ షోలో అందరి ముందు వాసంతి.. అర్జున్ కళ్యాణ్ కి ముద్దు పెట్టింది. దీనితో మరోసారి వీరిద్దరి గురించి రూమర్స్ చెలరేగాయి. దాని గురించి కూడా వాసంతి క్లారిటీ ఇచ్చింది. 

55

అదంతా స్క్రిప్ట్ లో భాగం అని వాసంతి పేర్కొంది. సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎలా ముద్దు సన్నివేశాల్లో నటిస్తారో మేము కూడా ఆ షోలో అలాగే చేశాం. కానీ దానిని హైలైట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అది వంద శాతం స్క్రిప్ట్. వాళ్ళు చెప్పినట్లే చేశాం అని వాసంతి పేర్కొంది. ఆ తర్వాత వాసంతి తన ఫ్యామిలీ  ఫ్రెండ్ పవన్ కళ్యాణ్  అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories