అల్లు అర్జున్ ని మూడు గంటలు ఎండలో నిలబెట్టిన సుకుమార్... పుష్ప 2 అందుకే ఆలస్యం!

Published : Mar 25, 2024, 10:43 AM IST

బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్త్యా పుష్ప 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కీలక విషయాలు ఆమె వెల్లడించింది. సుకుమార్ ఓ షాట్ కోసం అల్లు అర్జున్ మూడు గంటలు ఎండలో నిల్చోబెట్టినట్లు ఆమె తెలియజేసింది..   

PREV
16
అల్లు అర్జున్ ని మూడు గంటలు ఎండలో నిలబెట్టిన సుకుమార్... పుష్ప 2 అందుకే ఆలస్యం!

పుష్ప 2 పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. పుష్ప సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ పై హైప్ ఏర్పడింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ఇది. 

 

26

పుష్ప 2లో బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్త్యా ఓ కీలక రోల్ చేస్తుంది. ఆమె న్యూస్ రిపోర్టర్ గా అలరించనుంది. గత ఏడాది 'వేర్ ఈజ్ పుష్ప?' అంటూ ఓ ప్రోమో విడుదల చేశారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. వేర్ ఈజ్ పుష్ప? టీజర్ లో దివి రిపోర్టర్  గా కనిపించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు పుష్ప 2లో నిడివి ఉన్నట్లు తెలుస్తుంది. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

36

తాజా ఇంటర్వ్యూలో పుష్ప 2 గురించి పలు విషయాలు దివి వెల్లడించారు. దివి మాట్లాడుతూ... న్యూస్ రిపోర్టర్  రోల్ చేయడం అంత ఈజీ కాదు. కొందరు నటులతో పాటు రియల్ న్యూస్ రిపోర్టర్స్  తో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఒకసారి అందరూ నన్ను తోసుకుంటూ వెళ్లిపోయారు. నేను క్రిందపడిపోయాను. 

 

46

సుకుమార్ కి పర్ఫెక్షన్ కావాలి. తాను అనుకున్నట్లు సీన్ వచ్చే వరకు ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారు. పుష్ప 2లో ప్రతి షాట్ కి ఆయన 5 నుండి 35 టేక్స్ తీసుకుంటున్నారు. నటులు ఎటునుంచి రావాలి, ఎలా చూడాలి... ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత ఆలస్యమైనా కాంప్రమైజ్ అవరు. 

56

ఓ సీన్ కోసం అల్లు అర్జున్ మీద 40 టేక్స్ తీసుకున్నారు. దాదాపు రెండు మూడు గంటలు అల్లు అర్జున్ ఎండలో నిల్చోవాల్సి వచ్చింది. సుకుమార్ తాను అనుకున్నది అనుకున్నట్లు తీయాలనుకుంటున్నారు. అందుకే పుష్ప 2 ఆలస్యం అవుతుంది. పుష్ప 2 అందరి అంచనాలకు మించి ఉంటుందని దివి వెల్లడించింది. 


 

66

పుష్ప 2 చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. 

Read more Photos on
click me!

Recommended Stories