టాలీవుడ్ లో సంక్రాంతికి మూడు బడా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రాంచరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. గేమ్ ఛేంజర్ చిత్ర పరిస్థితి దారుణంగా ఉంది. తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం నష్టాల బాటలో పయనిస్తోంది. ఇక డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రం ప్రేక్షకుల ఆదరణతో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నాయి.