అజిత్ కొత్త చిత్రం ట్రైలర్ విడుదల.. తెలుగు టైటిల్ పై ట్రోలింగ్

Published : Jan 17, 2025, 09:55 AM IST

అజిత్ కుమార్ నటించిన 'విడాముయార్చి' చిత్రం తెలుగులో భారీగా  విడుదల కానుంది. తెలుగులో  ట్రైలర్ విడుదలైనప్పటికీ, టైటిల్ పై ట్రోలింగ్ జరుగుతోంది. 'బలం', 'తెగింపు', 'విశ్వాసం' వంటి డబ్బింగ్ టైటిల్స్ పై గతంలోనూ విమర్శలు వచ్చాయి.

PREV
15
అజిత్ కొత్త చిత్రం ట్రైలర్ విడుదల.. తెలుగు టైటిల్ పై ట్రోలింగ్
vidaamuyarchi

తమిళ సినిమాలు డబ్బింగ్ చేసేటప్పుడు అవే టైటిల్స్ తో తెలుగులోకి రావటం చాలా మంది తెలుగువాళ్లకు నచ్చటం లేదు. ఆ విషయం వాళ్లు సోషల్ మీడియాలో బహిరంగంగా ఎక్సెప్రస్ చేస్తూ వస్తున్నారు. లోకల్ జనాలను టార్గెట్ చేసేటప్పుడు లోకల్ టైటిల్ అనేది లేకపోతే కనెక్ట్ కాలేమన్నది వారి వాదన.

గతంలో రజనీకాంత్ సినిమాకు సైతం ఈ తెలుగు టైటిల్ వివాదం రిలీజ్ అప్పుడు సమస్యగా మారింది. అయితే లైకా వాళ్లు ఈ ఇష్యూని ముందుకు వెళ్లకుండా పుల్ స్టాప్ పెట్టడం కోసం టైటిల్ ని తెలుగులో పెట్టి పోస్టర్, ట్రైలర్ వదిలారు. అయితే ఇప్పుడా ట్రైలర్ చుట్టూ ట్రోలింగ్ మొదలైంది. 

25
vidaamuyarchi


తమిళ టాప్ స్టార్  అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కాంబినేషన్ లో  మ‌గిళ్ తిరుమేని డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం  ‘విడాముయ‌ర్చి’.తెలుగులో  ‘పట్టుదల’ టైటిల్ తో  రిలీజ్  చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీలో  గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.  అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

35
Ajith Kumar starrer Vidaamuyarchi film updates out


ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వ‌చ్చింది. మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లే క్ర‌మంలో మేక‌ర్స్ ‘పట్టుదల’ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

 

అయితే ట్రైలర్ బాగుందని టాక్ వచ్చినా టైటిల్ ఏంటి ఇలా ఉంది...పట్టుదల..బట్టతల అంటూ ట్రోల్ చేస్తున్నారు. అజిత్ సినిమాలకు తెలుగు టైటిల్స్ విషయంలో అసలు శ్రద్ద చూపటం లేదని, గతంలో కూడా తెలుగు డబ్బింగ్ టైటిల్స్ దారుణంగా పెట్టారని గుర్తు చేస్తున్నారు. వలీమై చిత్రాన్ని బలం అని, అలాగే మరో చిత్రాన్ని తెగింపు, వేరే చిత్రాన్ని విశ్వాసం, వివేకం ఇలాంటి టైటిల్స్ తో తెస్తున్నారని , సరైన టైటిలే దొరకటం లేదా అని విమర్శలు చేస్తున్నారు. 

45
Ajith Kumar starrer Vidaamuyarchi film updates out


 ‘పట్టుదల’ట్రైల‌ర్‌ విషయానికొస్తే..అజిత్ పట్టుదల ఉన్న వ్యక్తి పాత్రలో నటిస్తున్నట్టు టైటిల్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్  స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పేప‌ర్ లుక్‌తో నెవ‌ర్ బిఫోర్ అవతార్‌లో మరోసారి ప్రేక్షకులను మెప్పించబోతున్నారు.  ట్రైల‌ర్‌లో త‌న వాళ్ల కోసం అజిత్ విల‌న్స్‌తో చేస్తున్న పోరాటాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. 

55
Ajith Kumar starrer Vidaamuyarchi film updates out


 ‘పట్టుదల’ సినిమాలో మరోసారి అజిత్ సరసన త్రిష నటించింది. వీరిద్దరి మధ్య క్యూట్ కెమిస్ట్రీ అదిరింది.  అజ‌ర్ బైజాన్‌లో చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మ‌రో వైపు యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మ‌రోవైపు స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

‘మంగత్తా’, గ్యాంబ్లర్ సినిమా తర్వాత అర్జున్, అజిత్ మరోసారి కలిసి నటించారు.  రెజీనా క‌సాండ్ర సైతం ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి వైవిధ్య‌మైన పాత్ర‌లో కనిపించబోతుంది.  ఈ చిత్రంలో ఆర‌వ్‌,  నిఖిల్ నాయ‌ర్ త‌దిత‌రులు నటించారు.
 

Read more Photos on
click me!

Recommended Stories