`గేమ్‌ ఛేంజర్‌`, `వణంగాన్‌`, `కాదలిక్క నేరమల్లై`.. విశాల్‌ దెబ్బకి సంక్రాంతి సినిమాలు వాష్ ఔట్‌

Published : Jan 17, 2025, 09:51 AM IST

ఈ సంవత్సరం తమిళంలో పొంగల్ పండుగకు విడుదలైన `వణంగాన్`, `నేసిప్పాయ`, `గేమ్ ఛేంజర్`, `కాదలిక్క నేరమిల్లై` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి.

PREV
16
`గేమ్‌ ఛేంజర్‌`, `వణంగాన్‌`, `కాదలిక్క నేరమల్లై`.. విశాల్‌ దెబ్బకి సంక్రాంతి సినిమాలు వాష్ ఔట్‌
పొంగల్ రిలీజ్ సినిమాల బాక్సాఫీస్

2025 పొంగల్ కి కోలీవుడ్‌లో శంకర్ `గేమ్ ఛేంజర్`, బాలా-అరుణ్ విజయ్ `వణంగాన్`, కృతిక ఉదయనిధి దర్శకత్వంలో `కాదలిక్క నేరమిల్లై`, విష్ణువర్ధన్ `నేసిప్పాయ` విశాల్ `మదగజరాజా `విడుదలయ్యాయి. ఈ సినిమాల బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎలా ఉన్నాయి? విన్నర్‌ ఎవరు ? అనేది చూద్దాం. 

26
గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్

గేమ్ ఛేంజర్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా నటించిన `గేమ్ ఛేంజర్` కి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా ₹25 కోట్లకు అమ్ముడుపోయింది. ₹50 కోట్లు వసూలు చేయాలి. కానీ ₹7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కోలీవుడ్‌లో ఇది డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. 

36
వణంగాన్ బాక్సాఫీస్

వణంగాన్

బాలా దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన `వణంగాన్` సినిమాను సురేష్ కామాక్షి నిర్మించారు. ఈ సినిమా ₹4.69 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఒక్క రోజు కూడా కోటి రూపాయలు వసూలు కాలేదు. పరాజయం దిశగానే ఇది వెళ్తుంది.

 

46
కాదలిక్క నేరమిల్లై బాక్సాఫీస్

కాదలిక్క నేరమిల్లై

కృతిక ఉదయనిధి దర్శకత్వంలో రవి మోహన్ నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా రెండు రోజుల్లో ₹3.3 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. 

56
నేసిప్పాయ బాక్సాఫీస్

నేసిప్పాయ

విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్, అదితి శంకర్ నటించిన `నేసిప్పాయ` సినిమా రెండు రోజుల్లో ఒక కోటి మాత్రమే వసూలు చేసింది. ఇది పెద్ద ఫ్లాప్‌ దిశగా వెళ్తుంది. 

66
మదగజరాజా బాక్సాఫీస్

పొంగల్ విన్నర్

విశాల్ మదగజరాజా సినిమా మిగతా సినిమాలకు పోటీ ఇచ్చింది. ఈ సినిమా 4 రోజుల్లో ₹16 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకే ఎక్కువ థియేటర్లు దొరకడం వల్ల మిగతా సినిమాలు నష్టపోయాయి. విశాల్‌ కి చాలా రోజుల తర్వాత సక్సెస్‌ దక్కబోతుంది. మళ్లీ ఆయన పూర్వ వైభవం పొందబోతున్నారు. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories