ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. హీరోయిన్ గా రష్మిక మందన్ననే నటించనుంది. ఫాహద్ ఫాసిల్, సునిల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ బండారి, రావు రమేశ్, ధనంజయ్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని పార్ట్ వన్ కంటే.. భారీ బడ్జెట్ రూ.400 కోట్లతో నిర్మించనున్నారు.