కెరీర్ బిగినింగ్ లో అలాంటి అనుభవాలు... నా బూ**, బటక్స్ సర్జరీ చేయించుకో అన్నారు... రాధిక ఆప్టే సంచలనం!

Published : Jun 11, 2022, 03:49 PM IST

టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే (Radhika Apte) తన కెరీర్ లో ఎదురైన షాకింగ్ విషయాలు వెల్లడించారు. కొందరు ఆమె శరీరంపై ప్రయోగాలు చేయాల్సిందిగా సలహా ఇచ్చారని సంచలన సీక్రెట్స్ బహిర్గతం చేశారు. రాధికా ఆఫ్టే లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి.

PREV
16
కెరీర్ బిగినింగ్ లో అలాంటి అనుభవాలు... నా బూ**, బటక్స్ సర్జరీ చేయించుకో అన్నారు... రాధిక ఆప్టే సంచలనం!


ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన అనేక మంది హీరోయిన్స్ ఈ సర్జరీలు చేయించుకున్నారు. అయితే ఇలాంటి కృత్రిమ అందాలకు నేను విరుద్ధం అంటుంది హీరోయిన్  రాధికా ఆప్టే. అలాగే కెరీర్ బిగినింగ్ లో తన శరీరంలోని కొన్ని భాగాలను మార్చుకోవాలని, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోమని కొందరు సలహా ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. 

26


పరిశ్రమకు వచ్చిన కొత్తలో నేను ఈ ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఒక మీటింగ్ లో నా ముక్కు బాగా లేదు, సర్జరీ చేయించుకో అన్నారు. మరొక మీటింగ్ లో నా వక్షోజాలకు సర్జరీ చేయించుకో అన్నారు. తర్వాత మరో సందర్భంలో నా బటక్స్ మార్చుకోమంని, మరికొన్ని సందర్భాల్లో కాళ్లు, బుగ్గలు... ఇలా నా శరీరంపై అనేక ప్రయోగాలు చేయమని సలహాలు ఇచ్చారు. 

36

అయితే అది నాకు ఇష్టం లేదు. నేను ఎలా ఉన్నానో అదే నేను ఇష్టపడతాను. నేను కనీసం శరీరంలో మార్పులు తెచ్చే ఓ ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు. నిజానికి అలాంటి సలహాలు నన్ను ఇంకా దృఢంగా మార్చాయి. నన్ను నేను ఇష్టపడేలా చేశాయి. కృత్రిమమైన అందానికి నేను వ్యతిరేకం, నా జుట్టుకు రంగు వేసుకోవడానికి 30ఏళ్ళు పట్టింది... అంటూ రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.

46


2005లో సంజయ్ దత్ హీరోగా విడుదలైన ''వాహ్ లైఫ్ హోతో అస్లీ'' మూవీతో రాధికా ఆఫ్టే వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగులో రాధికా ఆఫ్టే మొదటి చిత్రం రక్త చరిత్ర. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. రక్త చరిత్ర 2, ధోని చిత్రాల్లో నటించారు. 
 

56


2014లో విడుదలైన బాలకృష్ణ-బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ లెజెండ్ మూవీలో హీరోయిన్ గా నటించారు. అలాగే బాలయ్యతో లయన్ మూవీలో మరోసారి జతకట్టారు. తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. ఎక్కువగా రాధికా హిందీ చిత్రాలలో నటించారు. 
 

66


నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ లస్ట్ స్టోరీస్ లో రాధికా బోల్డ్ రోల్ చేశారు. లస్ట్ స్టోరీస్ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది. రాధికా లేటెస్ట్ మూవీస్ రాత్ అఖేలి హైన్, ఫోరెన్సిక్ ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె విక్రమ్ వేద చిత్రంలో నటిస్తున్నారు. హ్రితిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ తమిళ్ రిమేక్. అలాగే రాధికా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీలో నటిస్తున్నారు. 

click me!

Recommended Stories